నీట్‌పై సీఎం విజయ్‌ సంచలన వ్యాఖ్యలు | Tamil Nadu: Many mocked us as actors party, Vijay's first detailed speech in assembly | Sakshi
Sakshi News home page

నీట్‌పై సీఎం విజయ్‌ సంచలన వ్యాఖ్యలు

Jun 23 2026 10:18 AM | Updated on Jun 23 2026 1:19 PM

Tamil Nadu: Many mocked us as actors party, Vijay's first detailed speech in assembly

చైన్నై: నీట్‌ పరీక్షపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య అర్హత పరీక్షలకు దేశవ్యాప్తంగా నీట్ ఒక్కటే అర్హత పరీక్షగా ఉందని తద్వారా అది అనేక వివాదాలకు మూలంగా నిలిచిందన్నారు.  నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. విజయ్‌ సీఎం హోదాలో తొలిసారిగా ఈ రోజు (మంగళవారం) ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. 

విజయ్ మాట్లాడుతూ" గత కొన్నేళ్లుగా నీట్ పరీక్ష అనేక వివాదాలకు మూలంగా ఉంది. ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుకొని, దేశంలో వైద్య విద్య విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రశ్నపత్రాలు లీకవడం వరకు ఈ వివాదం కొనసాగింది. ఈ పరీక్షను రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలని తమిళనాడు పదేపదే పిలుపునిచ్చింది". అని అన్నారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో అమలులో ఉన్న రెండు భాషల విధానం, అంటే తమిళం (రాష్ట్ర భాషగా), ఇంగ్లీష్ (ప్రపంచ భాషగా)  సరిపోతుందని నొక్కి చెప్పారు.

కరూర్ తొక్కిసలాట

కరూర్ తొక్కిసలాటపై ఆయన  మాట్లాడుతూ  "41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాదం గురించి నా బాధను నేను మాటల్లో చెప్పలేను. ఆ బాధ నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. కానీ ఆ నిందను కూడా మాపై వేస్తున్నారు. ఇది దారుణం. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని ఆవేదన వ్యక్తం చేశారు. 

పార్టీ విజయంపై 

విజయ్ ప్రసంగిస్తూ " ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అన్ని కష్టాలను అధిగమించి విజయం సాధించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే గెలవడానికి అనేక కుట్రలను, ఆంక్షలను అధిగమించాల్సి వచ్చిందని తెలిపారు.తమిళనాడు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మేము పడిన కష్టాలు మాకు మాత్రమే తెలుసు… కానీ ఇదంతా తెలిసినప్పటికీ, కొందరు ఏమీ అర్థం కానట్టు నటిస్తూ, అతను కేవలం ఒక నటుడు, పార్టీ కూడా నటుల పార్టీనే అని  ఎగతాలిగా మమ్మల్ని విమర్శిస్తారు. ఈ విజయం కోసం ఎన్నో కుట్రలను, కుతంత్రాలను అధిగమించి విజయం సాధించాం. " అని విజయ్‌ అన్నారు.

డీఎంకే అవినీతి

ఇది వరకూ ప్రభుత్వం డీఎంకేలా తాము అవినీతి చేయబోమని పార్టీ ఫండ్స్‌ కోసం టాస్‌మాక్‌ ఆదాయాన్ని డీఎంకే లూటీ చేసిందని ఆరోపించారు. ద్విబాషా విధానానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు.కాగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్‌ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవలే రైతులకు భారీ స్థాయిలో రుణమాఫీ ప్రకటించారు. అదేవిధంగా మరెన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.

సీఎం విజయ్ తొలి స్పీచ్ దద్దరిల్లిన అసెంబ్లీ..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను తారుమారు చేస్తూ ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం కొద్ది రోజల పాటు గవర్నర్ వ్యవహారంతో డ్రామా నడిచిన మిత్రపక్షాల సహాయంతో ఎట్టకేలకు విజయ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తొలిసారిగా సీఎం హోదాలో ప్రసంగించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement