పొలాల్లో పాములు రైతు మిత్రులా? శత్రువులా? | Suggestion to create awareness among farmers about venomous snakes | Sakshi
Sakshi News home page

పొలాల్లో పాములు రైతు మిత్రులా? శత్రువులా?

Aug 6 2026 4:26 AM | Updated on Aug 6 2026 4:26 AM

Suggestion to create awareness among farmers about venomous snakes

ఎలుకలు, పంది కొక్కుల వల్ల ఏటా 15–20% ధాన్యం ఉత్పత్తి నష్టం

పొలాల్లో కనిపించే పాముల్లో 80% విషం లేనివేఅంటున్న నిపుణులు

విషపూరిత పాములపైరైతులకు అవగాహన కల్పించాలని సూచన

పంట పొలాల్లో కనిపించే పాములు మనకు ప్రాణాంతక శత్రువుల్లాగే కనిపిస్తాయి. కానీ, అవగాహనతో చూస్తే.. నిజానికి అవి ఉచితంగా పంటలను కాపాడేందుకు ప్రకృతి ప్రసాదించిన రైతు మిత్రులేనని అర్థమవుతుంది. దేశంలో ఏటా 15–20 శాతం ధాన్యం ఉత్పత్తి ఎలుకలు, పందికొక్కుల వల్ల నాశనమవుతోందని అంచనా. దీనివల్ల దేశవ్యాప్తంగా రైతులకు ఏటా రూ.2 వేల కోట్లకుపైగా ప్రత్యక్ష ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఒక జత ఎలుకలు ఒక ఏడాది వ్యవధిలో 800 నుంచి 1,000 వరకు సంతతిని పెంచగలవు. వీటిని అరికట్టటానికి విష రసాయనాలను రైతులు వాడుతుంటారు. అవి నేల సారాన్ని పాడుచేయటమే కాకుండా, ఇతర జీవులకు ప్రాణసంకటంగా మారుతున్నా యని నిపుణులు చెబుతున్నారు.  

80% పాములతో ప్రమాదం లేదు
మన దేశంలోని పొలాల్లో కనిపించే పాముల్లో 80 శాతానికి పైగా (జెర్రిపోతు వంటివి) అసలు విషం లేనివే. ఒక నాగు పాము లేదా జెర్రిపోతు తన జీవితకాలంలో వేలాది ఎలుకలను వేటాడి తింటుంది. అయితే, ఈ విషయంపై అవగాహన లోపి స్తోంది. 20% విషపూ రిత పాముల భయంతో.. కనిపించిన పామునల్లా చంపటం వల్ల పొలాల్లో ఎలుకల జనాభా విపరీతంగా పెరిగి రైతులకు రెట్టింపు నష్టం జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

పాముల నుంచి రక్షణ ఎలా?
పాము కాట్ల వల్ల గత పాతికేళ్లలో మన దేశంలో లక్షా ఇరవై వేల మంది చనిపోయారు. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంతమంది ఈ కారణంతో చనిపోవటం లేదు. పొలాల్లో రాత్రివేళల్లో టార్చ్‌లైట్‌ ఉపయోగించటం, లాంగ్‌ గమ్‌ బూట్లు ధరించటం వంటి చర్యల ద్వారా 90% వరకు పాము కాటు ప్రమాదా లను అడ్డుకోవచ్చని అధ్యయనాలు చెబుతు న్నాయి. 

ఏఐ వంటి ఆధునిక సాంకేతికతతో తయారు చేసిన పాములను పారదోలే ఎలక్ట్రానిక్‌ చేతి కర్రలు వంటి ఆధునిక పరికరాలు ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి వస్తున్నాయి. వీటిని రైతులకు అందుబాటు లోకి తేవటానికి ప్రభుత్వం చర్యలు తీసుకో వాలి. అంతేకాదు, పాము కాటు బాధితుల ప్రాణరక్షణ కోసం గ్రామీణ ప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాంటీవెనమ్‌ను అందుబాటులో ఉంచాలి. పాముల సమస్యపై గ్రామీణులు, రైతులకు అవగాహన కల్పించటంపైనా ప్రభుత్వం శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు.

– సాక్షి, స్పెషల్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement