యూపీ, రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు | Road Accidents In Uttarpradesh Rajasthan 11 Died | Sakshi
Sakshi News home page

యూపీ, రాజస్థాన్‌లో నెత్తురోడిన రోడ్లు.. 11 మంది మృతి

Jul 19 2024 7:35 AM | Updated on Jul 19 2024 7:37 AM

Road Accidents In Uttarpradesh Rajasthan 11 Died

లక్నో/జైపూర్‌: యూపీ, రాజస్థాన్‌లలో  గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 11 మంది మృతి చెందారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. 

మృతులంతా హర్యానాకు చెందిన వారని సమాచారం. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జవడంతో అందులో ఇరుక్కున్నవారి మృతదేహాలను బయటికి తీయడం కష్టంగా మారింది. ప్రమాద  తీవ్రతకు కారులో నుంచి ఇద్దరు దూరంగా పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. 
ఉన్నావోలో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి 
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై ఉన్నావో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక స్కార్పియో వాహనం వేగంగా ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. స్కార్పియో ఢిల్లీ నుంచి అయోధ్య వెళుతున్నట్లు పోలీసులు చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement