పోక్సో కేసులో ఎస్‌ఐ ప్రవీణ్‌ అరెస్ట్‌ | POCSO case On SI Praveen | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో ఎస్‌ఐ ప్రవీణ్‌ అరెస్ట్‌

Jul 2 2026 11:37 AM | Updated on Jul 2 2026 3:44 PM

POCSO case On SI Praveen

బెంగళూరు: విచారణ పేరుతో బాలలను తీసుకువచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఆరోపణలపై అమృతహళ్లి ఎస్‌ఐ ప్రవీణ్‌ను కొత్తనూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏడాది క్రితం హత్య కేసులో విచారణ పేరుతో కొందరు బాలలను లాడ్జికి తీసికెళ్లిన ప్రవీణ్‌ వారిపై దాడిచేసి అసభ్యంగా డ్యాన్సులు చేయించి తన మొబైల్‌లో వీడియోలు తీసుకున్నాడు. 

ఇటీవల సదరు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో విషయం వెలుగు చూసింది. దీంతో అమృతహళ్లి పోలీసులు స్వయంప్రేరితంగా పోక్సో కేసు నమోదు చేసి కొత్తనూరు పోలీసులకు బదిలీ చేశారు. ఎస్సై ప్రవీణ్‌ మొబైల్‌లోని వీడియోలు కాపీ చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు లీక్‌ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్‌ఐకు సహకరించాడనే ఆరోపణలపై కానిస్టేబుల్‌ రాఘవేంద్రను సస్పెండ్‌ చేశారు.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement