రాజస్తాన్‌లో దారుణం.. అత్యంత పాశవికం, బాలికపై హత్యాచారం | Minor girl burnt body recovered from brick kiln in Rajasthan | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌లోని భిల్వారాలో దారుణం.. అత్యంత పాశవికం, బాలికపై హత్యాచారం

Aug 4 2023 6:02 AM | Updated on Aug 4 2023 8:49 AM

Minor girl burnt body recovered from brick kiln in Rajasthan - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లో భిల్వారాలో దారుణం చోటుచేసుకుంది. కొందరు రాక్షసులు 14 ఏళ్ల బాలికను చంపి, బొగ్గు బట్టీలో కాల్చేశారు. బుధవారం ఉదయం మేకల కాపలాకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆమె సోదరుడు, గ్రామస్తులు వెతుకులాట మొదలుపెట్టారు.

రాత్రికి గ్రామ సమీపంలోని మండుతున్న ఒక బట్టీలో బాలిక చేతి గాజు, ఎముక ముక్కలు..ఆ పక్కనే బాలిక చెప్పులు వారికి కనిపించాయి. దీంతో, వారు బట్టీలు నిర్వహించే కల్బేరియా తెగకు చెందిన అయిదుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికపై అత్యాచారం చేశాక, చంపి కొలిమిలో పడేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను ప్రశ్నిస్తున్నట్లు కోట్రి పోలీస్‌ స్టేషన్‌ అధికారులు చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement