సాక్షి, ఢిల్లీ: ఈ రోజు ( మంగళవారం) జరిగిన క్యాబినెట్ భేటీలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రవాణా, లాజిస్టిక్స్ రంగాల సమగ్ర అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
అదేవిధంగా రూ.500 కోట్లకు పైబడిన ప్రాజెక్టుల పర్యవేక్షణ, చిన్న, మధ్యతరహా సంస్థల కోసం రూ.10 వేల కోట్ల గ్రోత్ ఫండ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధిక సామర్థ్యం ఉన్న సంస్థల్లో ఈక్విటీ పెట్టుబడులు పెట్టి తయారీ, సాంకేతికత, ఎగుమతులు, ఉపాధికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి: ఒక కన్నుకు బదులుగా మరో కన్ను


