నేడు రాంచీలో తిరంగా యాత్ర
రాంచీ: జార్ఖండ్‌లో ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనలు శుక్రవారం 21వ రోజుకు చేరుకున్నాయి. శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరంగా యాత్ర చేపడతామని విద్యార్థులు తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరంగా యాత్రతో తమ ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.
ఉద్యోగ ఎంపిక పరీక్షల్లో మరింత పారదర్శకతను తేవాలని, పలు పరీక్షలను రద్దు చేసి, సీబీఐ లేదా రా్రõÙ్టతర రిటైర్డ్ జడ్జీలతో విచారణ జరిపించాలనే డిమాండ్లతో విద్యార్థులు నిరసనలను కొనసాగిస్తుండటం తెల్సిందే. ఈ నెల 10వ తేదీన చలో అసెంబ్లీ సందర్బంగా జరిగిన నిరసనలకు సంబంధించి పోలీసులు 300 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు పెట్టారు. కాగా, గత 13 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఆస్పత్రిలో చేరిన జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికార్ మోర్చా(జేఎల్‌కేఎం) నేత దేవేంద్రనాథ్ మహతో ఆరోగ్యం విషమంగా మారింది. ఆయనతోపాటు దీక్ష చేపట్టిన మరో నలుగురు విద్యార్థులకు కూడా సదర్ ఆస్పత్రిలోనే చికిత్సలు అందుతున్నాయి.


