Live: ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు | Independence Day 2026 LIVE: PM Modi at Red Fort Nation’s Address | Sakshi
Sakshi News home page

Live: ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Aug 15 2026 7:24 AM | Updated on Aug 15 2026 7:24 AM

Independence Day 2026 LIVE: PM Modi at Red Fort Nation’s Address

భారత దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద జరిగే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని హోదాలో ఆయనకిది ఈ వేడుకలకు ప్రాతినిధ్యం వహించడం 13వ సారి. 

అప్‌డేట్స్‌.. 

ఎర్రకోట చేరుకున్న ప్రధాని

  • దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు
  • రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన ప్రధాని
  • అనంతరం ఎర్రకోటకు చేరిక
  •  త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసులు గౌరవ వందనం ప్రధాని స్వీకరిస్తున్నారు

 

మువ్వన్నెల జెండా ఆవిష్కరణ.. 21 గన్‌ సెల్యూట్‌
ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా 21 గన్‌ సెల్యూట్‌, జాతీయ గీతాలాపన, సైనిక గౌరవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

👉ఈ ఏడాది వేడుకల్లో ‘వందేమాతరం’కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జాతీయ గీతం వందేమాతరం 150 ఏళ్ల వారసత్వాన్ని గుర్తు చేస్తూ తొలిసారి ఎర్రకోట అధికారిక కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. 

👉‘వికసిత్‌ భారత్‌–2047’ లక్ష్య సాధనలో యువశక్తి పాత్రను ఈసారి వేడుకల్లో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ప్రధాని.. వారి స్ఫూర్తితో భారత్‌ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement