రాష్ట్రంలో 2026 మే నెలలో పోలీసు శాఖలో నమోదైన ట్రాఫిక్ ఈ–చలాన్‌లు, రవాణా శాఖలో 1991 నుంచి 2022 వరకు నమోదైన చలాన్లపై 50 శాతం రాయితీని ఇచ్చినందున వాహనదారులు సద్వినియోగపరచుకోవాలని జిల్లా సెషన్స్ జడ్జి ఉషారాణి సూచించారు. నగరంలోని కొత్త కోర్టు సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు.
50 శాతం రాయితీతో ప్రజలు ఈ నెల 21 నుంచి జూలై 10వ తేదీలోగా చలాన్లను చెల్లించవచ్చన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి, నగర ఉప పోలీసు కమిషనర్ సుందర్‌రాజ్, నాగరాజ్ అంకనదొడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శివశంకర్, ఏఎస్పీ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక


