పోలీస్‌ కొలువుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ | Notification for police recruitment soon | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కొలువుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌

Jul 6 2026 5:17 AM | Updated on Jul 6 2026 5:17 AM

Notification for police recruitment soon

తెలంగాణ పోలీస్, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖ, ఎస్పీఎఫ్‌లో  కలిపి 7,437 పోస్టులు 

మొత్తం పోస్టుల్లో 148 సివిల్‌ ఎస్సై, 29 ఆర్‌ఎస్సై, 4,773 కానిస్టేబుల్‌ పోస్టులు 

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు శాఖతో పాటు, అగ్నిమాపకశాఖ, జైళ్లశాఖ, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగాల్లో కలిపి మొత్తం 7,437 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్పీఆర్బీ) చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. 

ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం స్థానిక కేడర్‌ వారీ పోస్టుల పంపిణీ, రోస్టర్‌ పాయింట్లు, విద్యార్హతలు తదితర వివరాలను హోంశాఖతో పాటు సంబంధిత విభాగాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే నియామక ప్రకటన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement