పోలవరం ప్రాజెక్ట్‌: అడ్‌హక్‌ నిధుల విడుదలకు కేంద్రం సానుకూలత

Gajendra Singh Shekhawat Chaired Meeting On Progress Of Polavaram - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిపై గురువారం సమావేశం జరిగింది. ఆరు అంశాలపై నిర్వహించిన ఈ సమావేశంలో సవరించిన అంచనాలు, పునరావాసం, నష్టపరిహారం చెల్లింపుపై చర్చ జరిగింది.

ఈ సమావేశంలో జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్,  సలహాదారు వేదిరే శ్రీరామ్ , ఏపీ ఇంజినీర్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, సీడబ్ల్యూసీ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు హాజరయ్యారు. పోలవరం పనుల పురోగతి, సమస్యలపై సమీక్షించామని, పోలవరం ప్రాజెక్ట్‌ వేగంగా పూర్తవ్వాలన్నదే సంకల్పమని కేంద్రమంత్రి షెకావత్‌ అన్నారు.

నిధుల విడుదలకు కేంద్రం సానుకూలం: ఏపీ ఇంజినీర్‌ చీఫ్‌ నారాయణరెడ్డి
పోలవరానికి రూ.17,414 కోట్ల అడ్‌హక్‌ నిధులు విడుదల చేయాలని కోరామని, నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు ఏపీ ఇంజినీర్‌ చీఫ్‌ నారాయణరెడ్డి తెలిపారు. తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, తొలిదశలోనే 100 శాతం డ్యాం పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. జూన్‌ 2024 కల్లా పోలవరం పూర్తి చేయాలని కేంద్రం సూచించిందని నారాయణరెడ్డి అన్నారు.
చదవండి: చంద్రబాబుది ఓ కాపీ పేస్ట్‌ బతుకు: సీఎం జగన్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top