ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య | Daughter and Mother Husband Incident | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

Sep 13 2026 8:37 AM | Updated on Sep 13 2026 8:40 AM

Daughter and Mother Husband Incident

కర్ణాటక: పక్షవాతంతో మంచాన పడిన భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య ఉదంతమిది. ఈ ఘటన  బెంగళూరు అవలహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ముబారక్, షహీనాబాను దంపతులకు 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. ముబారక్‌కు పక్షవాతం వచ్చి మంచానపడ్డాడు. వీరి కుమార్తెకూ ఆరోగ్యం బాగాలేదు. బాలికకు చికిత్స అందించే సాకుతో నహీముద్దీన్‌ ఖురేషి అనే వ్యక్తి ఇంటికి వచ్చి వెళ్లేవాడు.  కొద్దిరోజులకు షహీనాతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో ఉండడంతో తమ సంతోషానికి అడ్డు అని, పైగా రోగిష్టి అని షహీనా భావించింది. 

భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక రచించింది. తల్లి హసీనా జాన్‌తో కలిసి భర్త  మర్మాంగాన్ని కాలితో తన్ని తలపై దిండు పెట్టి చంపేసింది. కిత్తగనూరులోని యల్లప్ప గార్డెన్‌లో సెపె్టంబర్‌ 9న రాత్రి  ముబారక్‌ (45) చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడని విలపిస్తూ షహీనా అందరినీ నమ్మించే యత్నం చేసింది.  అయితే షహీనా వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న ముబారక్‌ బంధువులు పోలీసులకు విషయం చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ముబారక్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో ముబారక్‌ది సాధారణ మరణం కాదని, హత్యని తేలడంతో షహీనాబానును, ఆమె తల్లి హసీనా జాన్‌ను, షహీనా ప్రియుడు నహీముద్దీన్‌ ఖురేషిని అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement