● పండుగకు ప్రజలు ఊళ్లకు వెళ్లేందుకు కేఎస్ ఆర్టీసీ 2,400 అదనపు బస్సులను నడుపుతున్నట్లు తెలిపింది. శుక్రవారం రాత్రి బెంగళూరులోని తుమకూరు రోడ్డు, మైసూరు రోడ్డు, హోసూరు రోడ్లలో ప్రయాణికులు గుమిగూడారు.
● మెజెస్టిక్ బస్టాండు, రైల్వే స్టేషన్, జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి. మెజెస్టిక్‌లో ఎటు చూసినా బ్యాగులతో ప్రయాణికులే నిండిపోయారు. బస్సుల కోసం పోటీ ఏర్పడింది. శనివారం రాత్రి పొద్దుపోయే వరకు బస్సుల కోసం జనం వేచిచూశారు.
● మైసూరు రోడ్డు బస్టాండ్, శాంతినగర, నవరంగ, యశవంతపుర బస్టాండ్లలోనూ ఇదే దృశ్యం కనిపించింది.
● ప్రయాణికులు తరలిరావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుని బుక్ చేసుకున్న బస్సులను అందుకోలేకపోయినట్లు కొందరు ప్రయాణికులు వాపోయారు. పండుగ కోసం కొందరు 15 రోజుల ముందే టికెట్లు బుకింగ్‌లు చేసుకున్నారు.
● ప్రయాణికుల రద్దీని ఆర్టీసీ అదనపు బస్సులు కూడా తట్టుకోలేకపోయాయి. బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నిరంతరం తిరుగుతూ ఉన్నాయి.
● ఏ బస్సు చూసినా కిటకిటలాడింది. మహిళలకు ఉచితం కావడంతో మరింత రద్దీ ఏర్పడింది.


