రాయచూరు రూరల్: మహిళల్లో ఆత్మవిశ్వాసం, జ్ఞానం, స్వాభిమానం వృద్ధికి విద్య ప్రధానమని జిల్లా జైలర్ అనితా హిరేమని పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 10 రోజుల యోగా శిబిరాన్నుద్దేశించి ఆమె మాట్లాడారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పుస్తకాలను చవివి ప్రతిభను కనబరచాలన్నారు. యోగాను కేవలం శిబిరాలకే పరిమితం చేయకుండా దానిని నిత్య జీవితంలో అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో సువర్ణ, మల్లికార్జున, ప్రసన్న కుమార్, వీరనగౌడ, సరస్వతి, చెన్నబసవ, ఉమాదేవి, స్వరూపరాణి, సుమిత్ర, రంగనాథ్, సంతోష్‌లున్నారు.


