బెంగళూరు: ప్రియుడు ఫోన్ చేయడం లేదు, ఆమె కాల్ చేసినా స్పందించడం లేదు.. దీంతో బాధకు లోనై ఇద్దరు పిల్లల తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాగలకోటలోని బాంబే కాలనీలో జరిగింది. మొబైల్ సంబంధాల మాయలో తరిగిపోతున్న కుటుంబ బాంధవ్యాలకు ఈ సంఘటన ప్రతిబింబిస్తోంది. వివరాలు.. మెహబూబ్ బీ (27) మృతురాలు. ఈమె స్థానికంగా ఉంటున్న ఒక యువకునితో సంబంధం కలిగి ఉంది.
కొన్నిరోజులుగా అతడు ఈమెకు కాల్ చేయకపోగా, ఈమె ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు. దీంతో మెహబూబ్ బీ సెల్ఫీ వీడియో తీసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అతనికి పంపింది. నాతో మాట్లాడకపోతే నీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ మెసేజ్ కూడా పంపింది. అయినప్పటికీ అతడు పట్టించుకోలేదు. విరక్తి చెందిన మెహబూబ్ బీ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


