ఆంధ్రప్రదేశ్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలోని పీసీ ప్యాపిలి సబ్‌స్టేషన్ వద్ద బైక్‌ను ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను వజ్రకరూరు గ్రామానికి చెందిన జైనుల్లా, మహాబూబ్ బాషా, మహమ్మద్ రఫీగా గుర్తించారు. అయితే, వీరు ముగ్గురూ ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఉరవకొండలో కోర్టు పనిమీద వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. వీరు ప్రయాణం చేస్తున్నటువంటి బైక్ పీసీ ప్యాపిలి సబ్‌స్టేషన్ సమీపంలోకి చేరుకున్న తరుణంలో ప్రమాదావశాత్తు ఐచర్ వాహనాన్ని బలంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


