29న సీడబ్ల్యూసీ కీలక భేటీ  | Congress Party CWC To Meet On 29 September 2026 | Sakshi
Sakshi News home page

29న సీడబ్ల్యూసీ కీలక భేటీ 

Sep 25 2026 6:24 AM | Updated on Sep 25 2026 6:24 AM

Congress Party CWC To Meet On 29 September 2026

సర్, ఓటర్ల జాబితాపై ప్రత్యేకంగా చర్చ 

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ ఈనెల 29వ తేదీన సమావేశం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) పనితీరు, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జరగనున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసీ తీరుపై వెల్లువెత్తుతున్న తీవ్ర అభ్యంతరాలపై సీడబ్ల్యూసీ కూలంకషంగా చర్చించనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రానున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

కేంద్ర ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి గత 10 నెలల్లో కనీసం 14 సందర్భాల్లో ఓటర్ల జాబితా, సర్, ఎన్నికల సాఫ్ట్‌వేర్, ఓటర్ల నమోదుకు సంబంధించిన నిర్ణయాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వస్తున్న కథనాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అదేవిధంగా, కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం–6లో సర్‌కు సంబంధించిన కొత్త వివరాలను చేర్చడంపైనా ప్రస్తుతం వివాదం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో 29న జరిగే సీడబ్ల్యూసీలో కాంగ్రెస్‌ ప్రకటించనున్న కార్యాచరణపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement