ఢిల్లీలో మళ్లీ టెన్షన్‌.. టెన్షన్‌ | Cec Sir Row: Opposition Mps Protest In Delhi Day 3 Updates | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో మళ్లీ టెన్షన్‌.. టెన్షన్‌

Oct 8 2026 3:33 PM | Updated on Oct 8 2026 4:07 PM

Cec Sir Row: Opposition Mps Protest In Delhi Day 3 Updates

ఢిల్లీ: నగరంలో మళ్లీ హైటెన్షన్‌ నెలకొంది. మరోసారి విపక్షాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. రాజ్‌ఘాట్‌కు చేరుకున్న విపక్ష ఎంపీలు.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా వరుసగా మూడోరోజు ఆందోళనలు చేపట్టారు. కాసేపట్లో రాజ్‌ఘాట్‌కు చేరుకోనున్న విపక్ష ఎంపీలు.. అక్కడ ఆందోళన చేయనున్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని  ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మోదీ, అమిత్‌షా, జ్ఞానేశ్‌ కుట్ర పన్నుతున్నారు: రాహుల్‌
మేం శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు మాపై దాడి చేశారంటూ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఓట్‌ చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మోదీ, అమిత్‌షా, జ్ఞానేశ్‌ కుట్ర పన్నుతున్నారు. ఓట్‌ చోరీపై కేంద్రం సమాధానం చెప్పాల్సిందే. ప్రశాంతంగా ఆందోళన చేయాలనుకుంటున్నాం. నిన్న జంతర్‌మంత్‌ దగ్గర మాపై దాడులు చేశారు’’ అంటూ రాహుల్‌ ధ్వజమెత్తారు.

ఢిల్లీ రైల్వే స్టేషన్ రోడ్లు మూసివేత
ఇండియా కూటమి నేతల నిరసనలతో ఢిల్లీ రైల్వే స్టేషన్ రోడ్లను పోలీసులు మూసివేశారు.  దీంతో రైల్వే స్టేషన్‌కు వెళ్ళే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కన్నాట్ ప్లేస్ రోడ్‌లో గంటల కొద్దీ భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మూడో రోజు కూడా..
‘సీఈసీ రాజీనామా డిమాండ్‌’ ఉద్యమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మూడో రోజూ కూడా ‘సీఈసీ రాజీనామా డిమాండ్‌’ ఉద్యమాగ్ని మరింత రగులుతోంది. మొన్న (మంగళవారం) ద్యంతం ఉద్రిక్తంగా కొనసాగిన ఉద్యమంలో స్వయంగా పాల్గొని, నినదించి, అరెస్టయిన మిత్రపక్షాల ఎంపీలను అభినందిస్తూ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ ఖర్గే ఇచ్చిన మధ్యాహ్న విందు కాస్తా అనూహ్యంగా జంతర్‌మంతర్‌ ధర్నాస్థలికి ర్యాలీగా మారడం, మధ్యలోనే పోలీసులు అడ్డుకుని ఎంపీలను బస్సుల నుంచి దించేయడం, ఎంపీలు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగడం, పోలీసులు, ఎంపీల మధ్య వాగ్వాదం, తోపులాట, బలవంతంగా అరెస్ట్‌లతో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రిదాకా ఉద్యమం నాటకీయ పరిణామాల మధ్య కొనసాగిన సంగతి తెలిసిందే. ఇవాళ కూడా విపక్ష ఎంపీలు ఆందోళనలకు సిద్ధమయ్యారు.

ఇదీ చదవండి: జ్ఞానేశ్ కుమార్‌కు జెడ్‌ ప్లస్ భద్రత.. ఇంటికి పటిష్ట పహారా!

 

ఢిల్లీలో హైటెన్షన్...  సీఈసీ జ్ఞానేష్ ఇంటి వద్ద భారీ భద్రత

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement