సురభి మృతి వెనుక అసలు నిజం ఇదేనా? | Bengaluru physiotherapist Sai Surabhi Incident | Sakshi
Sakshi News home page

సురభి మృతి వెనుక అసలు నిజం ఇదేనా?

Jul 2 2026 7:31 AM | Updated on Jul 2 2026 11:01 AM

Bengaluru physiotherapist Sai Surabhi Incident

 హోంస్టేలో యువతి అనుమానాస్పద మృతి కేసు..  

 ప్రియుని డెత్‌నోట్‌ లభ్యం 

బెంగళూరు: చిక్కబళ్లాపురం నగరం వద్ద నందిహిల్స్‌ దగ్గర ముద్దేనహళ్లిలో ఓ హోం స్టేలో 3 రోజుల కిందట అనుమానాస్పదంగా మృతి చెందిన సురభి అనే యువతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. హోంస్టే గదిలో గంజాయి పీల్చడానికి ఉపయోగించే హుక్కా లభించింది. సురభి ప్రియుడు సంజిత్‌ అలీ రాసుకున్న డెత్‌ నోట్‌ దొరికినట్లు పోలీసులు తెలిపారు. సురభిది, తనది వేర్వేరు మతాలు కావడం వల్ల తమ ప్రేమను ఈ సమాజం అంగీకరించడం లేదని, వేర్వేరు మతాల్లో పుట్టడమే తాము చేసిన తప్పా అని రాశాడని తెలిపారు.  

ఇంకా అనుమానాలు..  
పైకి ఈ సంఘటన ప్రేమ విఫలం కావడం వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నా, గదిలో సురభి 10 అడుగుల ఎత్తుగల ఫ్యాన్‌కి ఉరి వేసుకోవడం అనుమానాలు కలిగిస్తోంది. సుజిత్‌ అలీ  ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకుంటే పూర్తి వివరాలు రాబట్టవచ్చని పోలీసులు చెప్పారు. సురభి మృతదేహం ఉన్న గదిలో గంజాయి పీల్చే హుక్కా, మద్యం బాటిల్, కొన్ని మందులు లభించడంతో అనుమానాలు రేకెత్తాయి. వాటిని పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. కేరళకు చెందిన వీరు బెంగళూరులో ఉండేవారు, అతడు క్యాబ్‌ డ్రైవర్‌గా, ఆమె ఫిజియోథెరపిస్టుగా పనిచేసేది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement