త్రిషకు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఆశ్చర్యం లేదు! | AIADMK Uday Kumar Slams TVK Vijay Govt In Tamil Nadu | Sakshi
Sakshi News home page

త్రిషకు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఆశ్చర్యం లేదు!

Jun 28 2026 8:45 AM | Updated on Jun 28 2026 10:39 AM

AIADMK Uday Kumar Slams TVK Vijay Govt In Tamil Nadu

సాక్షి, చెన్నై: సొంత స్నేహాలు, సినిమా సంబంధాల కోసమే ప్రభుత్వ పదవులను పంచుతున్న సీఎం జోసఫ్‌ విజయ్,  రానున్న రోజుల్లో నటి త్రిషకు డిప్యూటీ సీఎం పదవిని ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన అవశ్యం లేదని అన్నాడీఎంకే సీనియర్‌  నేత, మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్‌ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఓ వీడియో రికార్డింగ్‌ సందేశం విడుదల చేస్తూ, సీఎం విజయ్‌ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సినిమా వాళ్లకే అధికార కేంద్రాలా? 
ప్రభుత్వ పదవుల నియామకాలపై ఉదయకుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడులోని 8 కోట్ల మంది ప్రజల హక్కులను ఢిల్లీలో పరిరక్షించేందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అనే ప్రతిష్టాత్మక పదవి ఉందన్నారు. తమిళనాడులో అర్హులైన వారెవరూ ఈ పదవికి దొరకలేదా అని ప్రశ్నిస్తూ, తనతో సినిమాలు తీసిన వారికి, తన చిత్రాల్లో నటించిన వారికి, తన పర్సనల్‌ మేనేజర్లు జగదీష్‌ పళనిస్వామి, జాన్‌ ఆరోగ్యస్వామి, విష్ణురెడ్డి, రాధన్‌ పండిట్, వెంకట్‌ నారాయణ వంటి వారికే సీఎం విజయ్‌ ప్రభుత్వ పదవులు ఇచ్చుకుంటూ పోతున్నారని ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే త్వరలోనే  త్రిషను కూడా ఉప ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన ప్రకటించవచ్చని ఎద్దేవా చేశారు.

అన్నాడీఎంకే వర్గాలకు పదవులు 
మరోవైపు.. ప్రస్తుతం తిరుక్కళుక్కున్రం తూర్పు యూనియన్‌ కార్యదర్శిగా ఉన్న చెంగల్పట్టు తూర్పు జిల్లా ఎంజీఆర్‌ జి.కె.బాబు, అసోసియేషన్‌ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈమేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుక్కళుకుండ్రం వెస్ట్‌ యూనియన్‌ లీగ్‌ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఆర్‌.సెల్వంను ఆ పదవి నుంచి తొలగిస్తున్నారు. ప్రస్తుతం యూనియన్‌ లీగ్‌ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న పి. ముకుందన్, తిరుక్కలకుండ్రం వెస్ట్‌ యూనియన్‌ లీగ్‌ సెక్రటరీగా, చెంగల్పట్టు తూర్పు జిల్లా మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శిగా మధురాంతకం పంచాయతీ యూనియన్‌ కమిటీ అధ్యక్షురాలు గీత, అజయ్‌ మోహన్‌కుమార్‌ తిరుపోరూర్‌ ఉత్తర యూనియన్‌ కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement