‘చండీపురా’కు 16 మంది బలి.. 50 కేసులు నమోదు | 16 Dead of Chandipura Virus in Gujarat | Sakshi
Sakshi News home page

‘చండీపురా’కు 16 మంది బలి.. 50 కేసులు నమోదు

Jul 21 2024 10:34 AM | Updated on Jul 21 2024 10:54 AM

16 Dead of Chandipura Virus in Gujarat

గుజరాత్‌ను చండీపురా వైరస్‌ వణికిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని గుజరాత్ ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్ తెలిపారు. ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలోని హిమ్మత్‌పూర్‌లో మొత్తం 14 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయని, వీరిలో ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని హృషికేష్ పటేల్ తెలిపారు. చండీపురా వైరస్‌కు సంబంధించిన మూడు కేసులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చాయని, రాష్ట్రంలో 50 చండీపురా వైరస్ కేసులు నమోదయ్యాయన్నారు. దీని బారినపడి 16 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్రంలో చండీపురా వైరస్  పరిస్థితులను సమీక్షించారు. ఈ అంటువ్యాధి నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్ ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వైరస్‌ నివారణకు జిల్లాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేసేలా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి వెంటనే చికిత్స అందించాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement