● వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు
డిజిటల్ ఆయుధం
● పార్టీ జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కల్లూరు: జగన్ 2.0 సూపర్ యాప్ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలతో నేరుగా అనుసంధానం అయ్యేందుకు శక్తివంతమైన వేదిక అని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం కల్లూరులోని కాటసాని స్వగృహం దగ్గర ‘జగన్ 2.0 సూపర్ యాప్’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ మేయర్ రామయ్య తదితరులు హాజరయ్యారు. అనంతరం కాటసాని రాంభూపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వేగంగా చేరవేయడంలో ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జగన్ 2.0 సూపర్ యాప్ ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త చేతిలో ఉండాల్సిన డిజిటల్ ఆయుధమన్నారు. కార్యకర్తలు, నాయకులకు అనుసంధానంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అందరం సమష్టిగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాట సాని రాంభూపాల్‌రెడ్డి స్వయంగా తన మొబైల్‌లో ‘జగన్ 2.0 సూపర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, దాని వినియోగ విధానాన్ని నాయకులు, కార్యకర్తలకు వివరించారు. ప్రతి కార్యకర్త తమ మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రజలతో అనుసంధానమై పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తల కోసమే – బీవై రామయ్య
జగన్ 2.0 సూపర్ యాప్ కార్యకర్తల కోసమే అని మాజీ మేయర్ బీవై రామయ్య అన్నారు. కార్యకర్తలు నష్టపోకుండా, బాధపడకూడదనే యాప్ తీసుకొచ్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల అభివృద్ధి పనుల పేరుతో ఈవెంట్‌లు చేస్తున్నారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్నికల ముందు హడావుడిగా గుండ్రేవులు, వేదవతి, ఆర్‌డీఎస్ ప్రాజెక్టులకు జీవోలు ఇచ్చిన సీనియర్ నాయకులు అని ఎద్దేవా చేశారు. కూటమి నాయకుల అబద్ధాలు, మోసాలను రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా రావడం కూటమి పార్టీల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ అబ్జర్వర్ గుండం సూర్య ప్రకాష్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు నాగలక్ష్మీరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, వెంకటేశ్వర్లు, సాన శ్రీనివాసులు, నారాయణరెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, రమణారెడ్డి, శివశంకర్‌రెడ్డి, శివారెడ్డి, యూనస్, తిరుపాల్, గోపాల్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


