TS Elections 2023: ప్రచార హోరు.. అధినేతల జోరు

- - Sakshi

సీఎం ప్రజా ఆశీర్వాద సభలు ముమ్మరం

మరో మూడు నియోజకవర్గాల్లో నిర్వహణకు బీఆర్‌ఎస్‌ సన్నాహాలు

రోడ్‌షోలలో పాల్గొననున్న కేటీఆర్‌

త్వరలో రంగంలోకి దిగనున్న కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం

బీజేపీ అభ్యర్థుల ప్రచారానికి కేంద్ర మంత్రులు

నల్లగొండలో పాల్గొననున్న అమిత్‌షా

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని పరిగెత్తిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రధాన ఘట్టానికి రెండు వారాలే మిగిలి ఉండడంతో ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్న అన్ని పార్టీలు మరింత జోరు పెంచనున్నాయి. ముఖ్య నాయకుల రాకతో ప్రచారం తారస్థాయికి చేరనుంది. – సాక్షి ప్రతినిధి, నల్లగొండ

ప్రచారంలో కొంత ముందున్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించింది. మరో రెండు నియోజకవర్గాల్లో సభల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పాల్గొంటున్నారు. సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్‌, భువనగిరి, మునుగోడు ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొన్నారు.

పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు సంక్షేమ పథకాల అమలు, అవి ప్రజలకు అందుతున్న తీరు, ధరణి ప్రయోజనాలు, 24 గంటల విద్యుత్‌పై ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నెల 20న నకిరేకల్‌, నల్లగొండలో నిర్వహించే సభల్లో, 21వ తేదీన రెండోసారి సూర్యాపేటలో నిర్వహించే సభలో కేసీఆర్‌ పాల్గొంటారు.

ఇటీవల నకిరేకల్‌ నియోజకవర్గం చిట్యాలపట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కె.తారకరామరావు 20వ తేదీన ఆలేరు, మిర్యాలగూడలో, 22వ తేదీన కోదాడ పట్టణంలో రోడ్‌ షోలలో పాల్గొననున్నారు.

రేపు అమిత్‌షా పర్యటన
బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు బీజేపీ జాతీయ నేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు శోభ కరంద్లాజే, అనురాగ్‌ ఠాకూర్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌లు ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఈ నెల 18న మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నల్లగొండలో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇతర కేంద్ర మంత్రులను కూడా రంగంలోకి దింపేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.

గడపగడపకూ..
ముఖ్యనాయకుల సభలతోనే కాకుండా.. మిగతా రోజుల్లో అభ్యర్థులు వారి నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సభలు, సమావేశాలతో పాటు కుల సంఘాలు, యువతతో ప్రత్యేక సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. గడపగడపకూ తిరుగుతూ, అన్నా ఎట్లున్నవు... చెల్లె, అక్కా బాగున్నవా.. అమ్మా ఓటెయ్యాలే.. అంటూ ప్రచారం చేస్తున్నారు.

రాహుల్‌, ప్రియాంక సభలకు కసరత్తు
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ప్రచారానికి జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచగా, కోదాడ, హుజూర్‌నగర్‌లో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి రోడ్‌షోలలో పాల్గొన్నారు.

రాహుల్‌గాంధీ 17వ తేదీన ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ తరువాత రోజుల్లో నల్లగొండ జిల్లాలోనూ ఆయన పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనతోపాటు ప్రియాంకగాంధీ సభలను కూడా కాంగ్రెస్‌ నాయకులు ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-11-2023
Nov 17, 2023, 11:49 IST
సాక్షి, నిజామాబాద్‌: 58 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎన్నో గోసలు పడ్డాం. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపిండ్రు. ఎన్నో పోరాటాల అనంతరం...
17-11-2023
Nov 17, 2023, 10:14 IST
సాక్షి, ఆదిలాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు కామన్‌ సింబల్‌ ఉండగా వారు ఇప్పటికే...
17-11-2023
Nov 17, 2023, 09:55 IST
సాక్షి, ఆదిలాబాద్‌: ‘కరెంట్‌ కావాల్నా.. కాంగ్రెస్‌ కావాల్నా.., రైతుబంధు కావాల్నా.. రాబందా?..’ అంటూ సీఎం కేసీఆర్‌ ప్రజాఆశీర్వాద సభల్లో సభికులను...
17-11-2023
Nov 17, 2023, 08:37 IST
సాక్షి, హైదరాబాద్‌: ఎన్ని సంస్కరణలు తెచ్చినా..ఎన్నిమార్లు సవరణలు చేసినా..ఎంత మంది ఫిర్యాదులు చేసినా ఓటరు లిస్టులో మాత్రం తప్పుల్ని నివారించలేకపోతున్నారు....
17-11-2023
Nov 17, 2023, 08:04 IST
ఎన్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరగాలంటే రాష్ట్ర పోలీసులతో పాటు సాయుధ దళాల బందోబస్తు కూడా ఎంతో ముఖ్యం. ఆ...
17-11-2023
Nov 17, 2023, 04:44 IST
సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 28,057 మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం...
17-11-2023
Nov 17, 2023, 04:31 IST
సాక్షి, ఆదిలాబాద్‌/ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:  పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో బీదాబిక్కీ, చిన్నాపెద్ద, కులమతా లకు...
17-11-2023
Nov 17, 2023, 03:39 IST
చెరుపల్లి వెంకటేశ్‌: కార్పొరేటర్‌ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు. హైదరాబాద్‌ బల్దియా నుంచే ఇలా ఎదిగిన వారూ  చాలామంది...
17-11-2023
Nov 17, 2023, 03:02 IST
యెన్నెల్లి సురేందర్‌ : మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న సీఎం కేసీఆర్, మాజీ...
17-11-2023
Nov 17, 2023, 01:24 IST
కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మాట్లాడి స్మార్ట్‌ సిటీ కింద నిధులు తీసుకొస్తే ఎవడబ్బ సొమ్మని బీఆర్‌ఎస్‌...
17-11-2023
Nov 17, 2023, 01:24 IST
కరీంనగర్‌/కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ ప్రజల ఆశీర్వాదం, సీఎం కేసీఆర్‌ సహకారంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదేళ్లలో...
17-11-2023
Nov 17, 2023, 01:22 IST
మంచిర్యాలక్రైం: ఎన్నికల వేళ మావోయిస్టు లేఖలు కుమురంభీం జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 14న భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)...
17-11-2023
Nov 17, 2023, 01:20 IST
కరీంనగర్‌ అర్బన్‌: ఎన్నికలొచ్చాయంటే చాలు.. వివిధ రకాల పేర్లు డోలయమానంలో పడేస్తుంటాయి. అర్థం తెలియక అవగాహన లేని వారెందరో. ప్రిసైడింగ్‌...
17-11-2023
Nov 17, 2023, 01:20 IST
సారంగాపూర్‌(జగిత్యాల): ఓటర్లను మభ్యపెట్టి, తాయిళాలు ఇచ్చి, ఓటు వేయించేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని డీఎస్సీ వెంకటస్వామి హెచ్చరించారు. సారంగాపూర్‌ మండలంలోని...
17-11-2023
Nov 17, 2023, 01:00 IST
నిర్మల్‌చైన్‌గేట్‌: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఏఐసీసీ...
17-11-2023
Nov 17, 2023, 01:00 IST
నిర్మల్‌: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు అధి కారికంగా గుర్తుల కేటాయింపు ఖరారైంది. బీఫాంలను అందించిన ప్రధాన పార్టీలకు ముందే...
17-11-2023
Nov 17, 2023, 00:39 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయి...
17-11-2023
Nov 17, 2023, 00:38 IST
ఆర్మూర్‌: సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్‌ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ నెలకొననుంది. నామినేషన్లు, ఉపసంహరణల అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో...
16-11-2023
Nov 16, 2023, 14:57 IST
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరగబోయే మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. గత ఎన్నికల ప్రక్రియ ముగిశాక.. తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి 2019 జనవరి 15వ తేదీ...
16-11-2023
Nov 16, 2023, 13:58 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/జెడ్పీసెంటర్‌ /జడ్చర్ల/ దేవరకద్ర: ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టం ముగిసింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అసెంబ్లీ... 

Read also in:
Back to Top