జోరుగా వానలు | - | Sakshi
Sakshi News home page

జోరుగా వానలు

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

జిల్లాకేంద్రంలో 41.3 మి.మీ.,ల

వర్షపాతం నమోదు

కల్వకుర్తి టౌన్‌: జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎండల తీవ్రత నుంచి కాస్త ఉపశమనం లభించింది. కొంతకాలంగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడటంతో ఊరట కలిగింది. మరోవైపు వర్షాలు పంటలకు ప్రయోజనం చేకూర్చాయి. వర్షాభావ పరిస్థితులతో నీటి కోసం ఎదురుచూస్తున్న పంటలకు తాజా వర్షాలు కొంతమేర ప్రాణం పోశాయి. ముఖ్యంగా వర్షాధార పంట లు సాగు చేస్తు న్న రైతులకు ఈ వానలు ఆశలు కల్పించాయి. అయితే కొన్ని ప్రాంతా ల్లో లో తట్టు రహదారులపై నీరు నిలవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలు మరికొంతకాలం కొనసాగితే పంటలకు మరింత మేలు జరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు.

జిల్లాలో నమోదైన వర్షపాతం

వివరాలు (మి.మీ.,)

మండలం వర్షపాతం

నాగర్‌కర్నూల్‌ 41.3

వెల్దండ 37.3

తిమ్మాజిపేట 30.5

వంగూరు 19.2

ఉప్పునుంతల 17.5

అచ్చంపేట 16.3

బిజినేపల్లి 13.8

కొల్లాపూర్‌ 11.0

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement