జూరాల వద్ద ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

జూరాల వద్ద ఉద్రిక్తత

Sep 23 2026 1:25 AM | Updated on Sep 23 2026 1:25 AM

ఎక్కడికక్కడ వివిధ పార్టీల నాయకుల ఆందోళనలు

భారీగా పోలీసుల మోహరింపు.. ముందస్తు అరెస్టులు

పీజేపీ క్యాంపు వద్ద సీపీఎం..

సాగునీరు వెంటనే వదలాలని సీపీఎం ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా మంగళవారం ఆందోళన చేపట్టారు. తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ జూరాలకు రాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుపడిందని.. భూత్పూర్‌ వద్ద అరెస్ట్‌ చేసి ఠాణాకు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. రైతు, ప్రజా ప్రభుత్వమని పత్రికా ప్రకటనలు ఇస్తున్న కాంగ్రెస్‌.. సాగునీరు ఇవ్వడంతో విఫలమైందని ఆరోపించారు. ఆయకట్టు రైతులకు కనీసం వారాబందీ విధానంలోనైనా సాగునీరు ఇవ్వాలని.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పడంతో పోలీసులు కలుగజేసుకొని బలవంతంగా పోలీస్‌ వాహనంలో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

గద్వాల క్రైం/ అమరచింత/ ధరూరు: సాగునీటి కోసం రైతులు చేస్తున్న ఆందోళనలతో మంగళవారం జూరాల జలాశయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆరు రోజులుగా జూరాల కాల్వలకు సాగునీరు నిలిపివేయడంతో పంటలు కాపాడుకునేందుకు ఆయకట్టు రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మంగళవారం జూరాల ప్రాజెక్టు సందర్శనతోపాటు రైతులతో ముఖాముఖి నిర్వహించేందుకు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించడమే కాకుండా బీజేపీ, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. పోలీసుల కళ్లుగప్పి ప్రాజెక్టుకు చేరుకున్న పలువురిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌ వాహనాల్లో కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

సమాంతర కాల్వ వద్ద బీజేపీ..

రైతులకు సాగునీరు ఇవ్వాలంటూ బీజేపీ నాయకులు జూరాల సమాంతర కాల్వకు చేరుకున్నారు. నందిమళ్ల క్యాంపు వద్ద బారీకేడ్లు ఏర్పాటుచేసి పహారా కాస్తున్న పోలీసులకు సమాంతర కాల్వ వద్దకు బీజేపీ నాయకులు చేరుకున్నారనే సమాచారంతో అక్కడికి వచ్చి ప్రాజెక్టుపైకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. సాగునీరు వదలాలని కోరుతున్న రైతులపై ప్రభుత్వం పోలీసు బలగాలతో దాడులు చేయించడం దారుణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు ఆగమయ్యారని, వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు వదిలే వరకు ఇక్కడి నుంచి కదలమని బైఠాయించడంతో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement