నయనానందం.. గణనాథుడి నిమజ్జనోత్సవం | - | Sakshi
Sakshi News home page

నయనానందం.. గణనాథుడి నిమజ్జనోత్సవం

Sep 23 2026 1:25 AM | Updated on Sep 23 2026 1:25 AM

గణేశ్‌ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తుల నినాదాలు.. డీజే చప్పుళ్లు, మహిళల కోలాటాలు, యువతీ, యువకుల నృత్యాల మధ్య గణనాథుల నిమజ్జనోత్సవం నయనానందంగా సాగింది. తొమ్మిది రోజులపాటు భక్తుల చేత విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. జిల్లాకేంద్రంలోని ఆయా వీధుల్లో ప్రతిష్టించిన భారీ గణనాథులను మంగళవారం రాత్రి నిమజ్జనం చేశారు. పోలీసులు భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను దారి మల్లిస్తూ మండపాల వద్ద బందోబస్తు నిర్వహించారు. ఇదిలా ఉండగా.. చారకొండ మండలంలోని జూపల్లిలో యువసేన యూత్‌ ఆధ్వర్యంలో ఎలాంటి హంగు, ఆర్బాటాలు లేకుండా ఎద్దుల బండిపై గణనాథుడిని ఊరేగించి నిమజ్జనం నిర్వహించడం ఆకట్టుకుంది. – కందనూలు/ చారకొండ

నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు

కల్వకుర్తి టౌన్‌: వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనున్న పట్టణంలోని సిలార్‌పల్లి ఈదుల చెరువును కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ మంగళవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువు వద్ద భద్రత, బారికేడ్లు, విద్యుత్‌ దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారి సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, ఇందుకోసం పోలీసు, మున్సిపల్‌, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ షానవాజ్‌ ఖాన్‌, కమిషనర్‌ మహమూద్‌ షేక్‌, తహసీల్దార్‌ ఇబ్రహీం, సీఐ భీమ్‌కుమార్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement