పాంపాండ్ల నిర్మాణంపై దృష్టిసారించాలి | - | Sakshi
Sakshi News home page

పాంపాండ్ల నిర్మాణంపై దృష్టిసారించాలి

Sep 23 2026 1:25 AM | Updated on Sep 23 2026 1:25 AM

తాడూరు: ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నందున గ్రామాల్లో పాంపాండ్ల నిర్మాణంపై దృష్టిసారించాలని గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్‌ కమిషనర్‌ శేషుకుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంతోపాటు మేడిపూర్‌, యంగంపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న వీబీజీ రాంజీ పనులను మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం కూలీలతో మాట్లాడుతూ పనులకు రావాల్సిన ఆవశ్యకతను సిబ్బందికి, పనులను నిర్వహించే అంశాలకు సంబంధించి వివిధ సూచనలు చేశారు. ముఖ్యంగా భూగర్భ జలాలను పెంచే విధంగా పనులను చేపట్టాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించి విద్యార్థులకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శోభారాణి, ఏపీఓ చంద్రసిద్ధార్థ, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement