సర్‌ నో రెస్పాన్స్‌ | - | Sakshi
Sakshi News home page

సర్‌ నో రెస్పాన్స్‌

Sep 23 2026 1:25 AM | Updated on Sep 23 2026 1:25 AM

అచ్చంపేట: జిల్లాలో సర్‌ నోటీసులు జారీ అవుతున్నా విచారణ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. నోటీసులు అందుకున్నవారు నిర్దేశిత తేదీల్లో హియరింగ్‌కు హాజరు కావాలని ముందుస్తు సమాచారం ఇచ్చిన రావడం లేదు. కేటాయించిన తేదీలు గడిచిపోవడం.. రీషెడ్యూల్‌ చేయాల్సి రావడం వంటి పరిణామాలతో పెండింగ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా అన్‌మ్యాపింగ్‌, అనామలీస్‌ ఓటర్లందరికీ నిర్ణీత గడువులోగా నోటీసులు జారీ చేసి, హియరింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌ పదేపదే వీడియో కాన్ఫరెన్స్‌లో చెబుతున్నా నత్తనడకన సాగుతుంది. జిల్లాలో నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌, కల్వకుర్తి నియోజకవర్గాల్లో మొత్తం 1,81,295 మందికి సర్‌ నోటీసులు జనరేట్‌ కాగా.. 1,79,572 అందజేయగా.. 1,723 నోటీసులు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు హియరింగ్‌ తేదీల్లో గైర్హాజరు కావడంతో 1,32,833 నోటీసులు ల్యాప్స్‌ అయ్యాయి. నిర్దేశిత గడువులోగా ఎంతమంది విచారణకు హాజరవుతారు.. ఎంతమంది గైర్హాజరవుతారనేది కీలకంగా మారింది.

హియరింగ్‌ హాజరుకాక ల్యాప్స్‌ అయినవి 1,32,833

హాజరు పెంచడమే కీలకం

నోటీసులు జారీ చేయడంపైనే అధికార యంత్రాంగం దృష్టి సారిస్తోంది. నోటీసు అందుకున్న వారు నిర్ణీత తేదీన విచారణకు హాజరై తమ వాదనలు, ఆధారాలు సమర్పించినప్పుడే ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో హియరింగ్‌ తేదీ, సమయం, వేదికపై స్పష్టమైన సమాచారం అందించడం, గైర్హాజరైన వారికి వెంటనే తదుపరి తేదీ కేటాయించడం, పెండింగ్‌ కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని అంటున్నారు. లేకపోతే ఒకే కేసు పదేపదే తేదీలు కేటాయించే పరిస్థితి ఏర్పడి.. ఇప్పటికే ఉన్న పెండింగ్‌ తేదీలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలో సర్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పారదర్శక ఓటర్ల జాబితా తయారీలో భాగంగానే నోటీసుల జారీ మొదలు హియరింగ్‌, క్లెయిమ్స్‌, అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం. ఈఆర్వోలకు అందిన ఫారం–6, 7, 8 దరఖాస్తులను వేగవంతంగా విచారణ చేసేలా చర్యలు తీసుకుంటాం. పెండింగ్‌ నోటీసులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించడంతోపాటు నోటీసుల జారీ పూర్తి పాదర్శకంగా పాటించాలి.

– హేమంత కేశవ్‌ పాటిల్‌, కలెక్టర్‌

జిల్లాలో విచారణకు హాజరు కాని ఓటర్లు

నోటీసులు అందినా స్పందించని ప్రజలు

బీఎల్‌ఓలపై పెరుగుతున్న ఒత్తిడి

సిబ్బంది పరిమిత సంఖ్యలో ఉండటంతో వెనుదిరుగుతున్న వైనం

జిల్లాలో చర్చనీయాంశంగా మారిన ప్రక్రియ

ఇంకా

ఇవ్వాల్సినవి

1,723

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement