ప్రజావాణి ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

కందనూలు: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, వినతులను అధికారులు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయంతో కలిసి కలెక్టర్‌ ప్రజల నుంచి 58 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం ప్రజావాణి ద్వారా జిల్లాకు అందుతున్న ప్రజా వినతులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ పాండు, కలెక్టరేట్‌ ఏఓ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 13..

ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌ సెల్‌లో బాధితుల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 7 భూమి పంచాయితీ, 5 తగు న్యాయం చేయాలని, 1 భార్యాభర్తల గొడవలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ చెప్పారు.

సింగోటం ఆలయఈఓగా జయపాల్‌రెడ్డి

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని సింగోటం శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఈఓగా జనుంపల్లి జయపాల్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయ ఈఓగా పనిచేస్తున్న ఆయనను దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ సింగోటం ఆలయ అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు ఈఓ జయపాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు సింగోటం ఆలయ ఈఓగా ఉన్న రంగారావు పదోన్నతిపై వెళ్లారు. ఈ సందర్భంగా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఈఓకు ప్రధాన అర్చకులు సంపత్‌కుమార్‌శర్మ, సింగోటం సర్పంచ్‌ యాదన్నగౌడ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ చంద్రశేఖర్‌, సిబ్బంది రాజు, బాలపీరు, కిష్టయ్య, భాస్కర్‌ అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement