గిరిజన ప్రజావాణికి 39 వినతులు | - | Sakshi
Sakshi News home page

గిరిజన ప్రజావాణికి 39 వినతులు

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

మన్ననూర్‌: ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో సబ్‌ కలెక్టర్‌, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సలోని ఛాబ్రా సమక్షంలో చెంచుల సమస్య పరిష్కారం దిశగా మంగళవారం గిరిజన ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పరిధిలోని వివిధ మండలాలు, జిల్లాలకు చెందిన ఆదివాసీ చెంచులు హాజరై వ్యక్తిగత, ఆయా గ్రామాలు, గూడేలలోని సమస్యలు పరిష్కరించాలని 39 వినతిపత్రాలు అందజేశారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ చెంచులకు సంబంధించి విద్య, వైద్యం, ఉపాధి, పక్కా ఇళ్లు, వ్యవసాయ భూములు, తాగునీరు, రహదారులు వంటి సమస్యలపై వినతులు ప్రధానంగా వచ్చాయన్నారు. ముఖ్యంగా నల్లమల పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ చెంచులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు. వాటిపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహిస్తూ.. తమ సమస్యలు అధికారులకు నేరుగా చెప్పుకొనే అవకాశం కల్పించినందుకు చెంచులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement