'జిమ్ జిమ్ తార' పాట.. ఒక్క పాటతో సోషల్ మీడియా షేక్ | Zim Zim Thara Song Trending Viral Latest News | Sakshi
Sakshi News home page

Jim Jim Tara Song: ఒక్క పాటతో సోషల్ మీడియాను షేక్ చేసిన ‘పర్ణశాల’ టీమ్

Oct 6 2026 12:33 PM | Updated on Oct 6 2026 12:50 PM

Zim Zim Thara Song Trending Viral Latest News

సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ రావాలంటే భారీ ప్రమోషన్ బడ్జెట్, స్టార్ హీరోలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, వరుసగా రీల్స్, ఈవెంట్స్ అవసరమని భావించే రోజుల్లో ఓ చిన్న సినిమా టీమ్ మాత్రం అందుకు భిన్నమైన దారిని ఎంచుకుంది. ఒక్క క్రియేటివ్ ఐడియాతో భారీ ప్రమోషన్ ఖర్చును తగ్గించడమే కాకుండా తమ సినిమాను జనాల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆ మూవీనే 'పర్ణశాల'.

హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాట ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం చేసిన ఓ వినూత్న ప్రయత్నం అనూహ్యమైన స్పందనను తీసుకొచ్చింది. ఇప్పటికే లక్ష్మీదేవితో ‘జిమ్ జిమ్ తార’ పాటను పాడించిన చిత్ర బృందం, సినిమా ప్రచారానికి ఈ పాటనే ప్రధాన ఆయుధంగా మలుచుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా రూపొందించిన ప్రమోషనల్ మూవ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.

‘జిమ్ జిమ్ తార’ పాటకు వచ్చిన స్పందన సినిమాకు కూడా బజ్ తీసుకొచ్చేలా మారితే అది థియేట్రికల్ బిజినెస్‌తో పాటు ఓటీటీ, ఆడియో హక్కుల మార్కెట్‌పైనా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే ఓ పాట ఇంతగా వైరల్ కావడం ‘పర్ణశాల’ టీమ్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. మరి ఈ హైప్ థియేటర్ల వరకు కొనసాగుతుందా? ‘జిమ్ జిమ్ తార’ క్రియేట్ చేసిన బజ్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వై.జి.భరత్ దర్శకత్వంలో, మంచి వెంకట్ నిర్మిస్తున్న ‘పర్ణశాల’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement