'ఇప్పుడు యూత్ అంతా జియో , ఓయో మీదే న‌డుస్తోంది' | VJ Sunny Sound Party Trailer Released Today | Sakshi
Sakshi News home page

Sound Party Trailer: 'ఇప్పుడంతా జియో , ఓయో మీదే న‌డుస్తోంది'.. ఆసక్తిగా ట్రైలర్!

Nov 17 2023 6:39 PM | Updated on Nov 17 2023 7:41 PM

VJ Sunny Sound Party Trailer Released Today - Sakshi

వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించిన చిత్రం 'సౌండ్ పార్టీ'.  ఈ చిత్రాన్ని సంజయ్ శేరి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు.  ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ఈనెల 24న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించి ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరించనున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హీరో వీజే స‌న్నీ, శివ‌న్నారాయ‌ణ మధ్య వ‌చ్చే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తున్నాయి. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా పంచ్ డైలాగ్‌లు ఉన్నాయి. ఈ ట్రైలర్‌లో ప్ర‌స్తుతం యూత్ అంతా జియో , ఓయో మీదే న‌డుస్తోంది' అనే డైలాగ్ హైలెట్‌గా ఉంది. కాగా.. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి,  పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ఇంటూరి వాసు, చలాకి చంటి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మోహిత్ రెహమానిక్ సంగీతమందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement