ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న మాస్‌ కా దాస్‌ హీరో.. | Vishwak Sen's 'Family Dhamaka' Show Pre Launch in Kakinada - Sakshi
Sakshi News home page

Vishwak Sen: హోస్ట్‌గా అవతారమెత్తిన విశ్వక్‌.. ఫ్యామిలీ ధమాకా షో అప్పటి నుంచే స్ట్రీమింగ్‌

Published Mon, Sep 4 2023 3:57 PM | Last Updated on Mon, Sep 4 2023 4:38 PM

Vishwak Sen Family Dhamaka Show Pre Launch in Kakinada - Sakshi

మాస్‌ కా దాస్‌ విశ్వక్ సేన్ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్న కొత్త షో "ఫ్యామిలీ ధమాకా". ఈ షో ఆహాలో రాబోతోంది. ఈ షో ద్వారా విశ్వక్‌ సేన్‌ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టడమే కాకుండా ప్రేక్షకులని అలరించేందుకు రెడీ అయ్యాడు. "ఫ్యామిలీ ధమాకా" సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటలకు ప్రీమియర్‌ కానుంది. ఈ షో కుటుంబ మొత్తానికి వినోదాన్ని అందిస్తుంది. అయితే, ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఈ షో ఒకరోజు ముందే అందుబాటులోకి రానుంది.

ఆహా గోల్డ్‌ సబ్‌స్క్రైబర్లు సెప్టెంబర్‌ 7న మొదటి ఎపిసోడ్‌ని వీక్షించవచ్చు. ఇకపోతే ఈ షో ప్రీ లాంచ్ ఈవెంట్ కాకినాడలోని SRMT INOX మాల్‌లో జరిగింది. కాకినాడలోని కుటుంబాలతో కలిసి ఆహా ఫ్యామిలీ ధమాకా గేమ్‌ ఆడించారు. ఆ తర్వాత షో థీమ్ సాంగ్ మీద అందరూ డ్యాన్స్‌ చేసి ఆనందించారు. మరి విశ్వక్‌ సేన్‌ హోస్టింగ్‌ ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీ ధమాకా షో ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వనుందనేది తెలియాలంటే మరో మూడు, నాలుగు రోజులు ఆగాల్సిందే!

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, సిరీస్‌ల జాబితా ఇదిగో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement