తన ఆరోగ్య సమస్యను బయటపెట్టిన హీరో విష్ణు విశాల్ | Vishnu Vishal Opens Up About Autoimmune Health Condition, Says Medication Side Effects Affected His Appearance | Sakshi
Sakshi News home page

Vishnu Vishal: తన ఆరోగ్య సమస్యను బయటపెట్టిన హీరో విష్ణు విశాల్

Jun 25 2026 11:11 PM | Updated on Jun 26 2026 1:49 PM

Vishnu Vishal reveals his health problem of Autoimmune disease

సినీ నటుడు విష్ణు విశాల్ తన ఆరోగ్య సమస్యను బహిరంగంగా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఆయన అలసటగా, నీరసంగా కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. మొదట షూటింగ్ ఒత్తిడి కారణమని అంతా అనుకున్నారు. కానీ విష్ణు విశాల్ స్వయంగా నిజమైన కారణాన్ని చెప్పాడు.  

తన మాటల్లోనే.. నా ముఖం అలసిపోయినట్లు చాలామంది గమనించారు. దానికి కారణం నేను 3-4 సంవత్సరాలుగా 'ఆటోఇమ్యూన్ వ్యాధి'తో బాధపడుతున్నాను. వైద్యులు సూచించిన మందులు తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నా తొలి ప్రాధాన్యత ఆరోగ్యానికే ఇస్తున్నానని తెలిపారు.   

ఈ ప్రకటనతో ఆయన అభిమానులు మరింత మద్దతు వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే తన ఆరోగ్యం మెరుగుపడుతుందని, సినిమా ప్రమోషన్లు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. విష్ణు విశాల్ నటించిన గట్ట కుస్తీ 2 సినిమా వచ్చేనెల 3న థియేటర్లలో విడుదల కానుంది. గతంలో వచ్చిన గట్ట కుస్తీ తెలుగులోనూ మట్టి కుస్తీగా పేరుతో వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement