ఓటీటీలోకి రాబోతున్న విశాల్‌ 'రత్నం' సినిమా | Vishal Rathnam Movie Streaming Date | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి రాబోతున్న విశాల్‌ 'రత్నం' సినిమా

May 6 2024 12:43 PM | Updated on May 6 2024 1:23 PM

Vishal Rathnam Movie Streaming Date

కోలీవుడ్‌ డైరెక్టర్‌ హరి- విశాల్ కాంబోలో వచ్చిన సినిమా 'రత్నం'. ఏప్రిల్‌ 26న విడుదలైన ఈ చిత్రం విశాల్‌ అభిమానులను మెప్పించింది. పలు ట్విస్ట్‌లతో పాటు భారీ ఫైట్స్‌తో మాస్‌ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంది. అయితే, సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. 

కమర్షియల్ చిత్రాలను అందించడంలో  దర్శకుడిగా హరికి మంచి గుర్తింపు ఉంది. ఆయన నుంచి ఇప్పటికే భరణి, పూజా,సింగం సీక్వెల్స్‌  వచ్చిన విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ నటించింది. ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ రోజు సినిమాకు పోటీగా మరే పెద్ద సినిమా విడుదల కాకపోవడంతో రత్నం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో రత్నం సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇప్పుడు రత్నం సినిమా ఓటీటీలోకి రానుంది. మే 24న  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుందని నెట్టింట వైరల్‌ అవుతుంది. కొద్దిరోజుల్లో చిత్ర మేకర్స్‌ నుంచి అధికారికంగా ప్రకటన రావచ్చని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement