పాన్‌ ఇండియా స్థాయిలో ‘వనజీవి రామయ్య’ | The Life Story Of Padma Shri Daripalli Ramayya, Vanajeevi Ramaiah Biopic Will Release In Pan India | Sakshi
Sakshi News home page

పాన్‌ ఇండియా స్థాయిలో ‘వనజీవి రామయ్య’

Jul 3 2026 3:46 PM | Updated on Jul 3 2026 4:00 PM

vanajeevi ramaiah Biopic Will Release In Pan India

కోటి మొక్కల రామయ్యగా ప్రసిద్ధి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ ‘వనజీవి రామయ్య’ పేరుతో వెండితెరపైకి రానుంది. బ్రహ్మాజీ టైటిల్‌ రోల్‌లో, నాగరాణి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వేముగంటి దర్శకత్వంలో నిడిగొండ నరేష్‌ కుమార్‌ ప్రజాపతి నిర్మిస్తున్నారు. జూలై 1న దరిపల్లి రామయ్య జయంతిని పురస్కరించుకుని మూవీ టీమ్, వాస్విక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వనజీవి అవార్డు పురస్కార మహోత్సవం నిర్వహించారు.

 పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవకులను సత్కరించారు. ‘‘వనజీవి రామయ్య’ ని పాన్‌ ఇండియా స్థాయిలో పూర్తి స్థాయి ఫీచర్‌ ఫిల్మ్‌గా నిర్మిస్తున్నాం’’ అని నిడిగొండ నరేష్‌ ప్రజాపతి, దర్శకుడు వేముగంటి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement