తగ్గేదేలే అంటున్న త్రిష.. ఏకంగా రూ.12 కోట్లు! | Trisha Krishnan Hikes Her Remuneration Amid Karuppu Success | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే అంటున్న త్రిష.. ఏకంగా రూ.12 కోట్లు!

Jun 13 2026 8:34 AM | Updated on Jun 13 2026 10:40 AM

Trisha Krishnan Hikes Her Remuneration Amid Karuppu Success

ఇటీవల ట్రెండింగ్‌లో ఉన్న పేరు త్రిష అటు రాజకీయ రంగంలోనూ, ఇటు సినీ రంగంలోనూ సంచలనం సృష్టించిన నటి ఈ బ్యూటీ. వయసును అస్సలు పట్టించుకోని అతి కొద్ది మంది కథానాయికల్లో ఈ భామ ఒకరు. పాన్‌ ఇండియా కథానాయకిగా పేరు గాంచిన గత త్రిష రెండు దశాబ్దాలకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈమెకు అపజయాలు పలకరించిన వెంటనే విజయాలు పులకరింప చేస్తాయి. 

అయితే ఫ్లాపులు ఎదురైనప్పుడు సైలెంట్‌గా ఉండే ఈ భామ విజయాలు వరించినప్పుడు మాత్రం చాలా మంది నటీమణుల మాదిరిగానే పారితోషికం పెంచేస్తుంటారు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం విజయంతో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన త్రిషకు ఆ తరువాత సరైన హిట్‌ రాలేదు సరికదా అజిత్‌ సరసన నటించిన విడాముయర్చి, కమలహాసన్‌తో కలిసి నటించిన థగ్‌లైఫ్‌ చిత్రాలతో విమర్శలను ఎదుర్కొన్నారు.   

ముందే చెప్పినట్టు ఒకటి రెండు ఫ్లాపులు తరువాత ఈ సంచలన నటికి హిట్స్‌ వెతుక్కుంటూ వస్తాయి. అలా కరుప్పు చిత్రం రూపంలో తాజాగా సూపర్‌ హిట్‌ వచ్చింది. అంతే ఇప్పుడు త్రిష తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఒక తమిళ చిత్రంలో త్రిషను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. 

ఈ చిత్రానికి ఆమె రూ.12 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. కరుప్పు చిత్రానికి ఎక్కువ మొత్తంలోనే పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగినా, ఇప్పుడు దాని కంటే ఇంకా అధికంగా డిమాండ్‌ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో త్రిష పారితోషికం తగ్గించే విధంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో నిజం ఎంతో తెలియ దు కానీ త్రిష పారి తోషికం విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారనేది వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement