ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం | Samantha Temple And Special Pooja On Her Birthday Latest | Sakshi
Sakshi News home page

Samantha Temple: సామ్ కోసం గుడి కట్టిన అభిమాని.. ఈసారి కూడా

Apr 28 2025 4:18 PM | Updated on Apr 28 2025 6:03 PM

Samantha Temple And Special Pooja On Her Birthday Latest

దక్షిణాది ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా తెలుగు వాళ్లకు అభిమానం ఎక్కువ. ఎంతలా అంటే పక్కనోళ్ల కంటే సినిమా వాళ్లని దేవుళ్ల కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. కొందరైతే అంతకు మించి అనేలా ప్రవర్తిస్తారు. దీనికి నిదర్శనమే ఆంధ్రప్రదేశ్ లో సమంత కోసం అభిమాని కట్టిన గుడి.

తమిళనాడులో ఖుష్బూ, జయలలిత, హన్సిక లాంటి హీరోయిన్లకు అభిమానులు దేవాలయాలు కట్టారు. అదే తరహాలో ఆంధ్రలోని బాపట్లలో ఓ వీరాభిమాని.. సమంత కోసం 2023లో గుడి కట్టాడు. అప్పట్లో ఓ విగ్రహం ఏర్పాటు చేయగా.. ఇప్పుడు గోల్డెన్ కలర్ సామ్ విగ్రహాన్ని పెట్టాడు.

(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్

సోమవారం సమంత పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజాలు చేసి కేక్ కట్ చేశాడు. పలువురు అనాథ పిల్లలకు సదరు అభిమాని.. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత చేసిన ఛారిటీ వర్క్స్ నచ్చే ఆమెకు ఈ గుడి కట్టానని సదరు అభిమాని చెప్పడం విశేషం.

కొన్నాళ్ల ముందు వరకు వరస సినిమాలు చేసిన సమంత.. నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ వ్యాధి బారిన పడిన దగ్గర నుంచి పూర్తిగా మూవీస్ చేయడం మానేసింది. గతేడాది 'సిటాడెల్' చేసింది గానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు నిర్మాతగా 'శుభం' అనే సినిమాని విడుదలకు రెడీ చేసింది.

(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?)    

Advertisement
 
Advertisement
Advertisement