రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే?.. రేణు దేశాయ్ సమాధానం ఇదే! | Renu Desai Reveals Why She Didn’t Remarry After Her Divorce from Pawan Kalyan | Sakshi
Sakshi News home page

Renu Desai: 'ఆ కారణంతోనే రెండో పెళ్లి చేసుకోలేదు'.. రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్

Apr 9 2025 7:43 PM | Updated on Apr 9 2025 9:22 PM

Renu Desai reveals why she didnot Marry after divorce from Pawan Kalyan

పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్.. రెండేళ్ల క్రితమే టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ హీరోగా నటించిన టైగర్‌ నాగేశ్వరరావు మూవీలో కీలక పాత్రలో మెప్పించింది. అయితే ప్రస్తుతం సినిమాలేమీ చేయకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటోంది. సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా రియాక్ట్ అవుతూ ఉంటోంది. ఇటీవల హెచ్‌సీయూ భూముల వివాదంపై రేణు దేశాయ్ స్పందించారు. వన్య ప్రాణులను ఇబ్బంది పెట్టొద్దని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్‌ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోలేదన్న విషయంపై మాట్లాడారు. రెండో పెళ్లిపై చేసుకోవాలని చాలా సార్లు ‍అనిపించింది.. కానీ నాపై ఇద్దరు పిల్లల బాధ్యత ఉందని గుర్తు చేసుకున్నారు. నాకు, పిల్లలకు మధ్య మరో వ్యక్తి వస్తే ఎలా ఉంటుందనేది చాలా సెన్సిటివ్ విషయమని రేణు దేశాయ్ తెలిపింది.

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. "నాకు కూడా భాగస్వామి కావాలని అనిపిస్తుంది. కానీ నా పిల్లల పట్ల నాకున్న బాధ్యత వల్లే సింగిల్‌గా ఉంటున్నా. వ్యక్తిగతంగా చూస్తే నాకు బాయ్‌ఫ్రెండ్ ఉండాలి.. నాకు పెళ్లి కావాలి.. నాకంటూ ప్రత్యేకమైన జీవితం ఉండాలని ఉంటుంది. కానీ నేను పిల్లల కోణం నుంచి ఆలోచిస్తే ఇది సాధ్యం కాదు. నా పిల్లలకు నేను సింగిల్ పేరేంట్. ఆద్యకు ఇప్పుడు 15 ఏళ్లు. మరో మూడేళ్ల తర్వాత తాను కాలేజీకి వెళ్తుంది. ఆద్య తన జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది.

కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్  బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు.  ఈ జంటకు అకీరా నందన్‌, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్‌లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement