
ఈ తరం అమ్మాయిలు పెళ్లి కంటే కెరీర్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్నది కాదనలేని విషయం. ఇంతకు ముందు 16, 18 ఏళ్లకే అమ్మాయిలను పెళ్లీడుకొచ్చారనే వారు. ఇప్పుడు అంతా మారిపోయింది. 21 ఏళ్లు దాటిన తరువాతనే పెళ్లిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే సినిమా రంగంలో అయితే 35 దాటిపోతోంది. చాలా మంది హీరోయిన్లు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గానే ఉంటున్నారు. అలాంటి వారిలో నటి రెజీనా( Regina Cassandra) ఒకరు. ఈమె బహుభాషా నటి. తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో కథానాయకిగా నటించి పాపులర్ అయ్యారు.
ముఖ్యంగా తమిళంలో 2005లో విడుదలైన కండనాళ్ మొదల్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నటించిన అసుర చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టినా, శివకార్తీకేయన్‌కు జంటగా నటించిన కేడీబిల్లా కిల్లాడి రంగా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తెలుగు, కన్నడం భాషల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే కొంత కాలంగా సరైన అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. దీంతో ప్రత్యేక పాటల్లో నటించడంతోపాటు ప్రతినాయకి పాత్రల్లో నటించడానికి సై అన్నారు. అదే సమయంలో వెబ్ సిరీస్‌లోనూ నటించడం ప్రారంభించారు. ఇలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న రెజీనా చాలా బోల్డ్ నటి అనే ముద్ర వేసుకున్నారు. అందాలారబోతకు నో చెప్పని ఈ భామ వయసు 34 ఏళ్లు.

ఈమె తమిళంలో చివరిగా నటించిన చిత్రం విడాముయర్చి. అందులో నెగిటీవ్ పాత్రలో నటించారు. కాగా ఇటీవల ఒక భేటీలో 34 ఏళ్లు వచ్చాయి. పెళ్లెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ముక్కు సూటిగా బదులిచ్చిన రెజీనా పెళ్లెప్పుడు చేసుకుంటావని తన తల్లే అడగదని, మీరెందుకు అడుగుతున్నారు? మీకెందుకు అంత అక్కర అని చెప్పింది. అంతే కాకుండా తనతో ఎవరైనా సంబంధం పెట్టుకుంటే వారికే కష్టం అనీ, అందుకే ఫ్రెండ్‌షిపే బెటర్ ఈజీగా ఉంటుందని చెప్పారు. దీంతో నెటిజన్లు ఈ అమ్మడిపై రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు.అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటారా? లేక అవివాహితగానే ఉండిపోతారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.