వాళ్లు పెద్దోళ్లు.. ఖుష్బూపై అలిగిన సీనియర్ నటుడు | Radha Ravi Reacts Not Invites Kushboo Daughter Wedding | Sakshi
Sakshi News home page

Radha Ravi: అప్పుడు నా అవసరమొచ్చింది.. ఇప్పుడు పెళ్లికి పిలవలేదు

Jul 4 2026 4:42 PM | Updated on Jul 4 2026 4:53 PM

Radha Ravi Reacts Not Invites Kushboo Daughter Wedding

ఒకప్పటి హీరోయిన్, నటి ఖుష్బూ కుమార్తె అవంతిక పెళ్లి.. కొన్నిరోజుల క్రితం గోవాలో జరిగింది. దీనికి తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన చిరంజీవి, నాగార్జున, త్రిష, తమన్నాతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకొచ్చాయి. అయితే ఈ వేడుకకు తనని పిలవకపోవడంపై సీనియర్ రాధారవి అసంతృప్తి వ్యక్తం చేశారు. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)

'ఖుష్బూ కూతురి పెళ్లికి నన్ను పిలవలేదు. అందుకే వెళ్లలేదు. ఇప్పుడు వాళ్ల స్థాయి చాలా పెద్దది అయిపోయిందో ఏమో నాకు తెలీదు. కనీసం సుందర్ అయినా పిలుస్తారని అనుకున్నాను. కానీ ఆయన కూడా ఆహ్వానించలేదు. వాళ్ల కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా సన్నిహితంగా ఉంది కదా పెళ్లికి తప్పకుండా పిలుస్తారని అనుకున్నాను. సుందర్.. మధురై నుంచి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన బయలుదేరేముందు శుభాకాంక్షలు చెప్పింది నేనే. అయినా పెళ్లికి పిలవలేదు. బహుశా కొందరినే పిలవాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. నన్ను పిలిచి ఉండే తప్పకుండా వెళ్లేవాడిని. ఎన్నికల టైంలో మాత్రం నా మద్ధతు అవసరమైంది. ఇప్పుడు అవసరం లేకపోయి ఉండొచ్చు' అని రాధారవి అన్నారు.

రాధా రవికి ఖుష్బూ, సుందర్.సితో చాలా ఏళ్లుగా అనుబంధముంది. ఖుష్బూతో కలిసి చిన్న తంబి, అన్నామలై, మన్నన్ సినిమాల్లో ఈయన నటించారు. సుందర్ దర్శకత్వం వహించిన అరణ్మనై, అరణ్మనై 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 

(ఇదీ చదవండి: నాగబంధం vs రావు బహదూర్.. తొలిరోజు ఎవరికి ఎన్ని కోట్లు?)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement