నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? | R Narayana Murthy About University Movie | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి?

May 29 2023 3:39 AM | Updated on May 29 2023 3:39 AM

R Narayana Murthy About University Movie - Sakshi

ఆర్‌.నారాయణ మూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. స్నేహచిత్ర పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. జూన్‌ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.

ఆర్‌.నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘10వ తరగతిలో పేపరు లీకేజీలు.. గ్రూప్‌ 1, 2లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీలు జరుగుతున్నాయి. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్‌ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి?. కుంభ కోణాలు చేసే వారి వల్ల  విద్యావ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ నిర్వీర్యం కావాలా?. మనది నిరుద్యోగ భారతం కాదు.. ఉద్యోగ భారతం కావాలని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాబూరావు దాస్, కథ–స్క్రీన్‌ ప్లే–మాటలు– సంగీతం– దర్శకత్వం– నిర్మాత: ఆర్‌. నారాయణ మూర్తి.

Advertisement
 
Advertisement
Advertisement