కొత్త ప్రపంచాన్ని చూస్తారు.. బన్నీ-తివిక్రమ్‌ మూవీపై నిర్మాత కామెంట్‌ | Producer Naga Vamsi Interesting Comments On Allu Arjun Trivikram Fourth Film | Sakshi
Sakshi News home page

బన్నీ-తివిక్రమ్‌ మూవీ: రాజమౌళి కూడా టచ్‌ చేయలేదు.. కొత్త ప్రపంచం సృష్టించబోతున్నాం

Oct 26 2024 11:06 AM | Updated on Oct 26 2024 11:20 AM

Producer Naga Vamsi Interesting Comments On Allu Arjun Trivikram Fourth Film

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప 2 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత మూడేళ్లుగా ఈ సినిమాపైనే బన్నీ ఫోకస్‌ చేశాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజుల కిందటే ప్రకటించారు. ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ లాంటి హ్యాట్రిక్‌ హిట్ల తర్వాత బన్నీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రమిది. 

ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నిర్మాత నాగవంశీ తన మాటలతో ఆ అంచనాలను మరింత పెంచేశాడు. ఇప్పటి వరకు ఎవరూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమాలో చూస్తారని ఆయన చెప్పారు.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్ని-త్రివిక్రమ్‌ మూవీపై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చాడు. ‘ప్రస్తుతం త్రివిక్రమ్‌ తన ఫోకస్‌ అంతా ఈ సినిమాపైనే పెట్టాడు. స్క్రిప్ట్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జనవరిలో ఓ స్పెషల్‌ ప్రోమోతో సినిమాను ప్రకటిస్తాం. మార్చి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని ఓ కొత్త కథతో రాబోతున్నాం. 

రాజమౌళి సైతం ఇలాంటి జానర్‌ని టచ్‌ చేయలేదు. మంచి విజువల్స్‌ ఉంటాయి. దేశంలో ఎవరూ చూడని సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా సినిమా ఉంటుంది’అని చెప్పారు. నాగవంశీ మాటలతో బన్నీ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమా రాబోతుందని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement