ఓటీటీలోనూ తగ్గేదేలే.. ఆ జాబితాలో టాప్‌ ప్లేస్‌లో కల్కి! | Prabhas Kalki 2898 AD Record in Ott Trending In top Place World Wide | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD: ఓటీటీలో కల్కి.. ప్రపంచవ్యాప్తంగా ఆ జాబితాలో టాప్‌లో ట్రెండింగ్‌!

Sep 5 2024 1:21 PM | Updated on Sep 5 2024 1:45 PM

Prabhas Kalki 2898 AD Record in Ott Trending In top  Place World Wide

ప్రభాస్- నాగ్‌అశ్విన్‌ కాంబోలో వచ్చిన ఎపిక్ బ్లాక్‌బస్టర్‌ మూవీ కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సైన్స్ ఫిక్షన్‌ యాక్షన్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  థియేటర్లలో నెల రోజులకు పైగా అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రస్తుతం ఓటీటీలోనూ కల్కి మూవీకి విపరీతమైన క్రేజ్‌ వస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో సౌత్‌ లాంగ్వేజేస్‌లో అందుబాటులో ఉంది. హిందీ వర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. స్ట్రీమింగ్‌కు వచ్చిన రెండు వారాల్లోనే అత్యధికంగా 2.6 మిలియన్ల వ్యూస్‌, 7.5M గంటల టైమింగ్‌తో గ్లోబల్‌లో టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది.  నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్‌ చిత్రాల జాబితాలో వరల్డ్‌ వైడ్‌గా మొదటి స్థానంలో కొనసాగుతోంది. కాగా..ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.

కాగా.. ఈ మూవీకి సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. పార్ట్-2లో కమల్‌ హాసన్‌ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండనుంది. ఈ మూవీని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement