దేశం వదిలి వెళ్లిపోతాడు.. పోలీసులతో హర్షసాయిపై బాధితురాలు | Police Considering Issuing Lookout Notice To Harsha Sai Over Allegations Against Escape | Sakshi
Sakshi News home page

Harsha Sai Case Updates: దేశం వదిలి వెళ్లిపోతాడు.. పోలీసులతో బాధితురాలు

Sep 28 2024 3:24 PM | Updated on Sep 28 2024 4:14 PM

Police Will Lookout Notice To Harsha Sai

తెలుగు యూట్యూబర్‌ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై అత్యాచారం చేయడంతో పాటు నగ్నచిత్రాలతో బ్లాక్‌మెయిల్‌ చేశాడని నార్సింగ్‌ పోలీసులకు సినీ నటి ఫిర్యాదు ఇచ్చింది. అయితే, తాజాగా ఆమె మరో విషయంపై హర్షసాయి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను దేశం వదిలి వెళ్లిపోతున్నాడంటూ తెలిపింది.

యువతి ఫిర్యాదుతో పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసులు రెండు రోజులుగా వెతుకుతున్నారు. అయితే, ఆయన దేశం వదిలి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారని ఆ యువతి పోలీసులకు తాజాగా చెప్పింది. ఆయన ఫోన్‌ కూడా ఆఫ్‌లో ఉన్నట్లు సమాచారం. కొద్దిరోజుల్లో హర్షసాయి పోలీసుల వద్ద లొంగిపోకుంటే అతనిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. హర్షసాయిపై ఫిర్యాదు చేసినందుకు తనకు బెదిరింపులు వస్తున్నట్లు ఆ యువతి పోలీసులకు తెలిపింది. సోషల్‌మీడియాలో తనపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాల‌ని యువతి ఫిర్యాదులో తెలిపిన‌ట్లు స‌మాచారం.

సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన ఒక యువతి కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఒక రియాల్టీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఒక ప్రైవేటు పార్టీలో ఆమెకు హర్షసాయి పరిచయం కావడం.. ఆపై వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. అయితే, స్నేహంగా ఉంటూనే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసినట్లు ఆ యువతి పేర్కొంది. ఈ క్రమంలో తన వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement