ఈ కారణంతో సర్జరీ కూడా చేపించుకోలేదు: పాయల్‌ రాజ్‌పుత్‌ | Payal Rajput Comments On Her Surgery | Sakshi
Sakshi News home page

ఈ కారణంతో సర్జరీ కూడా చేపించుకోలేదు: పాయల్‌ రాజ్‌పుత్‌

Oct 21 2023 9:18 PM | Updated on Oct 21 2023 9:30 PM

Payal Rajput Comments On Her Surgery - Sakshi

ఆర్ఎక్స్100తో సూపర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి మహాసముద్రంతో ఫ్లాప్ ఇచ్చాడు. చాలారోజుల గ్యాప్‌ తర్వాత పక్కా ప్లాన్‌తో ఈసారి మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకులముందుకొస్తున్నాడు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని సోషల్‌ మీడియా వేదికగా మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్​ 17న థియేటర్లలో విడుదల కానుంది. 1980లో ఒక గ్రామంలో వరుస హత్యల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి భారీ యాక్షన్‌ మూవీ.. తెలుగులోనూ రిలీజ్‌.. బిగ్‌ అప్‌డేట్‌)

ఈ కథపై హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ తాజాగా ఒక విషయాన్ని ఇలా షేర్‌ చేసింది. 'అజయ్‌ నన్ను అప్రోచ్‌ అయ్యే టైమ్​కు నా పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నాను. సర్జరీకి వెళ్లాల్సిందే అని వైద్యులు సూచించారు. అయితే అజయ్‌ చెప్పిన కథ నాకెంతో నచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాను. సినిమా పూర్తయ్యాకే సర్జరీకి వెళ్తాను.' అని అప్పుడే చెప్పాను. ఇదొక అద్భుతమైన కథతో రూపొందిన సినిమా అని. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అలాగే తనకు కూడా తెలుగులో మంచి విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నట్లు పాయల్‌ చెప్పుకొచ్చింది.

ఈ సినిమా ట్రైలర్‌ను చిరంజీవి ఎందుకు లాంచ్‌ చేశారంటే 

‘మంగళవారం’ సినిమా నిర్మాత స్వాతిరెడ్డి గునుపాటి తన కుమార్తె శ్రీజకి మంచి స్నేహితురాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. స్వాతిరెడ్డి ఎంతో డైనమిక్ అమ్మాయి అని.. అలాంటి అమ్మాయి నిర్మాణ సంస్థను ఏర్పాటుచేయడమే కాకుండా తనే దగ్గరుండి ఒక సినిమాను నిర్మిస్తే కచ్చితంగా ప్రోత్సహించాలని మెగాస్టార్‌ చెప్పారు.  ‘మంగళవారం’ ట్రైలర్‌ను ఎక్స్ ద్వారా విడుదల చేసిన చిరంజీవి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 

(ఇదీ చదవండి: 'భగవంత్‌ కేసరి'కి షాకిచ్చిన తారక్‌,మెగా ఫ్యాన్స్‌.. భారీగా నష్టాలు)

Advertisement
 
Advertisement
Advertisement