చిరు పక్కన అనామక హీరోయిన్? | Kannada Actress Nishvika Naidu Special Song In Chiranjeevi Vishwambhara Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Chiranjeevi: కన్నడ బ్యూటీతో చిరు స్పెషల్ సాంగ్!

Jun 24 2025 10:53 AM | Updated on Jun 24 2025 12:00 PM

Nishvika Naidu Along With Chiranjeevi Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ జోరుగా సాగుతోంది. మరోవైపు చిరు 'విశ్వంభర' నుంచి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా రావట్లేదు. అసలు ఈ మూవీని ఇప్పట్లో రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఏమైనా ఉన్నారా అనేది తెలియట్లేదు. ఫైనల్‌గా ఇప్పుడు ఓ ముగింపు ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారట. ఉన్న ఒక్క సమస్య కూడా తీరిపోయిందని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'పంచాయత్' కొత్త సీజన్)

'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన సినిమా 'విశ్వంభర'. దీన్ని కూడా ఫాంటసీ జానర్‌ కథతోనే తీశారు. అయితే చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజ్ చేయగా.. విపరీతమైన విమర్శలు వచ్చాయి. దీంతో టీమ్ పునరాలోచనలో పడిపోయింది. గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం 'రామరామ' అంటూ సాగే ఓ పాట రిలీజ్ చేశారు. ఇది కూడా జనాల్లోకి పెద్దగా రీచ్ కాలేదు.

అయితే చిరంజీవి లాంటి హీరోకు.. స్పెషల్ సాంగ్ చేసేందుకు హీరోయిన్ దొరకట్లేదని మొన్నటివరకు రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికేసినట్లు తెలుస్తోంది. కన్నడ నటి నిష్విక నాయుడు.. చిరు పక్కన డ్యాన్స్ చేయనుందని, ఈ పాటతో షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. ఒకవేళ అంతా పూర్తి చేసినా సరే ఈ ఏడాదిలో సినిమా రిలీజ్ చేస్తారా అనేది అనుమానంగా ఉంది.

(ఇదీ చదవండి: హీరోయిన్ సమంతకు కష్టకాలం!)

ఎందుకంటే జూలైకి ఎన్నిరోజులు లేదు. ఆగస్టులో తారక్, రజినీకాంత్ సినిమాలు ఉన్నాయి. సెప్టెంబరులో మిరాయ్, ఓజీ లాంటి చిత్రాలు రెడీగా ఉన్నాయి. పోనీ అక్టోబరులో ప్లాన్ చేద్దామా అంటే అక్కడ కూడా అఖండ 2, కాంతార 2 లాంటి పాన్ ఇండియా సినిమాలున్నాయి. డిసెంబరులో 'రాజాసాబ్' ఉండనే ఉన్నాడు. ఇలా రాబోయే ఆరు నెలలు ఫుల్ ప్యాక్డ్‌గా రిలీజులు ఉన్నాయి. మరి వీటన్నింటి మధ్యలో 'విశ్వంభర'ని రిలీజ్ చేస్తారా? లేదంటే ఏం చేస్తారనేది చూడాలి?

ఇక నిష్విక నాయుడు విషయానికొస్తే.. 'బిచ్చగాడు' కన్నడ రీమేక్ అమ్మ ఐ లవ్ యూ అనే సినిమాతో హీరోయిన్‍‌గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత చిన్న చిన్న మూవీస్ చేసింది. మరి ఇలాంటి అనామక హీరోయిన్‌ని చిరు సరనస తీసుకోవాలనే ఆలోచన ఎవరిది? దీనికి కారణమేంటి అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్'.. నేను చేసిన పెద్ద తప్పు: దిల్ రాజు)

Advertisement
 
Advertisement
Advertisement