తెలుగు హీరో నారా రోహిత్ తండ్రి అయ్యాడు. ఇతడి భార్య శిరీష.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: 'బంగారం'కి చిరు ఆశీర్వాదం.. మెగా సర్‌ప్రైజ్ గిఫ్ట్ కూడా)
'బాణం' సినిమాతో హీరోగా పరిచయమైన నారా రోహిత్.. తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు. మధ్యలో కొన్నాళ్ల పాటు మూవీస్ పక్కనబెట్టేశాడు. రీసెంట్ టైంలో భైరవం, సుందరకాండ తదితర మూవీస్ చేశాడు. ఇకపోతే తనతో పాటు 'ప్రతినిధి 2' చిత్రంలో హీరోయిన్ గా చేసిన శిరీషని ప్రేమించిన రోహిత్.. గతేడాది అక్టోబరులో ఆమెని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్లకు మగబిడ్డ పుట్టాడు.
(ఇదీ చదవండి: సీఎం విజయ్‌ని అన్ ఫాలో చేసిన త్రిష.. ఏమైంది?)


