ప్రియుడితో టాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్.. ఫోటోలు డిలీట్ | Kuberaa actress Sunaina Yella break up with her Lover | Sakshi
Sakshi News home page

Sunaina Yella: కుబేర నటి బ్రేకప్.. ప్రియుడి ఫోటోలు డిలీట్

Jun 16 2026 9:33 AM | Updated on Jun 16 2026 11:24 AM

Kuberaa actress Sunaina Yella break up with her Lover

ప్రస్తుత రోజుల్లో డేటింగ్, బ్రేకప్స్ చాలా సర్వసాధారణమైపోయాయి. ఇది సినీ రంగంలో కాస్తా ఎక్కువే. తాజాగా మరో నటి బ్రేకప్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కుమార్‌ వర్సెస్‌ కుమారి అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సునయన.. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. అయితే ఆమె తన ప్రియుడితో విడిపోయినట్లు సమాచారం. 

కాగా.. యునైటెడ్‌ అరబ్‌ ఎయిరైట్స్‌కు చెందిన కఖలిత్‌ అల్‌ అమెరికా అనే వ్యక్తి ప్రేమలో పడిన సునయన.. వీరి ప్రేమ వ్యవహారం నిశ్చితార్థం వరకు కూడా వెళ్లింది. తాజాగా వీరిద్దరి రిలేషన్‌కు ఎండ్ కార్డ్ పడినట్లేనని అర్థమవుతోంది. ఆమె తన ప్రియుడితో ఉన్న ఫోటోలను ఇన్‌స్టా నుంచి డిలీట్ చేసింది. దీంతో బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ వ్యవహారంపై సునయన గానీ.. ఆమె ప్రియుడు గాని స్పందించకపోవడం గమనార్హం.

కాగా.. నాగ్‌పూర్‌కు చెందిన సునయన ఎల్లా మోడల్‌గా తన కెరీర్‌ ప్రారంభించింది.  2005లో తెలుగులో కుమార్‌ వర్సెస్‌ కుమారి అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత  మలయాళం, కన్నడ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అదేవిధంగా కాదలిల్‌ విళిందేన్‌ అనే చిత్రంతో తమిళంలోనూ అడుగుపెట్టింది. ధనుశ్, నాగార్జున నటించిన కుబేర మూవీలోనూ మెరిసింది. తమిళంలో మాసిలామణి ,వంశం, నీర్‌ పారైవ,  సమర్‌ వంటి పలు చిత్రాల్లో నటించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement