రూ.10 కోట్లు కట్ చేస్తామన్నారు.. 'కుబేర' నిర్మాత ఆవేదన | Kubera Movie Ott Details And Producer Asian Sunil Interview | Sakshi
Sakshi News home page

Kubera: చెప్పిన డేట్‌కి రిలీజ్ చేయ్.. లేదంటే రూ.10 కోట్లు కట్

Jun 8 2025 9:21 PM | Updated on Jun 8 2025 9:21 PM

Kubera Movie Ott Details And Producer Asian Sunil Interview

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓటీటీల ఆధిపత్యం నడుస్తోంది. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలనేది సదరు సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు దీని గురించి నిర్మాతలు పెద్దగా ఓపెన్ అయింది లేదు. కానీ త్వరలో రిలీజ్ కాబోతున్న 'కుబేర' నిర్మాత సునీల్ నారంగ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న సమస్యల గురించి తన అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: గ్రాండ్‌గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)

ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకుడు. జూన్ 20న థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ కాస్త హైప్ తీసుకొచ్చాయి. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాతలైన సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ఓటీటీల ఆధిపత్యం గురించి చెప్పుకొచ్చారు. 'మేం 'కుబేర' చిత్రానికి జూలైలో రిలీజ్ చేస్తామని అడిగాం. కానీ ప్రైమ్ వాడు మాత్రం జూన్ 20న విడుదల చేయండి లేదంటే ఓటీటీ డీల్ నుంచి రూ.10 కోట్లు కట్ చేస్తామని అన్నాడు' అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యూబ్ సిస్టమ్, బుక్ మై షో, ఓటీటీల ఆధిపత్యం నడుస్తోందని సునీల్ నారంగ్ చెప్పుకొచ్చారు. అలానే 140 కోట్ల మంది జనాభాలో 40-50 మంది హీరోలు మాత్రమే ఉన్నారని.. దీంతో వాళ్లు దేవుళ్లతో సమానం అని చెప్పుకొచ్చారు. ఇకపోతే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా ఈయన శనివారం సాయంత్రం ఎన్నికయ్యారు. ఆదివారం సాయంత్రానికల్లా రాజీనామా చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎవరికి వారు ప్రకటనలు జారీ చేస్తున్నారని, కొందరి వ్యాఖ్యలు తనని బాధించాయని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్‌గా కొనసాగడం కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష‍్మీ)

Advertisement
 
Advertisement
Advertisement